గుడిలో గంట ఎందుకు కొడతారు?

గుడిలో గంట ఎందుకు కొడతారు?
x
Highlights

ప్రతి దేవాలయంలో, ప్రతి పుణ్యక్షేత్రంలో నైనా సరు దేవునికి ఎదురుగా గంట కనిపిస్తుంది. ఏ చిన్న దేవాలయంలోనైనా ఈ గంటను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు.

ప్రతి దేవాలయంలో, ప్రతి పుణ్యక్షేత్రంలో నైనా సరు దేవునికి ఎదురుగా గంట కనిపిస్తుంది. ఏ చిన్న దేవాలయంలోనైనా ఈ గంటను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. దేవాలయానికి వెళ్లిన భక్తులు ఖచ్చితంగా గంటను కొట్టిన తరువాతే దేవుడిని దర్శించుకుంటారు. అలాగే గుడిలో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు, నైవేద్యం పెట్టినపుడు, అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన కైంకర్యాలు చేసినపుడు గంటను కొడతారు.

అయితే చాలా మంది ఒక సందేహం ఉంటుంది. అసలు గుడిలో గంట ఎందుకు కొడతారు ? గంట కొట్టడం వలన ప్రయోజనం ఏంటి అని అనే సందేహం అనేక మందికి ఉంటుంది. ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం.

ఆలయంలో కొట్టే గంటకు ఎన్నో అర్థాలు, పరమార్థాలున్నాయి. దేవుని ముందు గంట కొట్టడం వలన ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తులను, చెడు శక్తులను, నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుందని చెపుతుంటారు. అంతే కాదు దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకుని గంట కొడితే అది దేవుడిని చేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే సకల శుభాలకు సంకేతం అని కూడా అంటారు. ఇక ఆలయంలో కానీ, ఇండ్లలో చేసుకునే ప్రత్యేక పూజలలో కానీ గంటను వాయిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతే కాక మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

గంట భాగాల్లో ప్రత్యేకతలు...

గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఇమిడి ఉంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఈ గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు.

హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు..

హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే ఈ గంటను కొడతారు. అంటే దీనికి అర్థం ఏంటంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న దేవుని మాత్రమే హారతి ఇవ్వకుండా సకలదేవుల్లని ఆలయంలో ఆహ్వానిస్తుంటారు. అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. అందుకే ఆచార్యులు చెపుతుంటారు హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్లు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్ష దైవాంశ రూపంగా దర్శించాలి అని.

ఇక పోతే కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుందని అంటుంటారు. ఈ నాదం వినబడడం వలన మనిషిలో ఉన్న చింతలు, సమస్యలను తొలగిపోతాయని, మనసుని దేవుడిపై ఆధ్యాత్మిక భావన కలిగేలా చేస్తుందని చెపుతారు.

ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే కొన్ని ఆలయాల్లో గంటలను గుత్తులు, గుత్తులుగా ఒకేతాడుకి కట్టి తగిలించి ఉంటుంది. ఈ గంటలు కేవలం అలంకారప్రాయమే ఉంటాయి, అంతేకాని ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఈ గంటలకు ఉండదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories