ధర్మ సందేహం: భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలా?

ధర్మ సందేహం: భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలా?
x
Highlights

పెద్దలు చెప్పే ఎన్నో మాటలకు పిల్లలు అర్థం తెలీక అయోమయంగా ఉండిపోతారు. వాళ్లకు వచ్చే సందేహాలెన్నో ఉంటాయి. నిత్యం ఎన్నెన్నో సందేహాలు అందరికీ వస్తుంటాయి....

పెద్దలు చెప్పే ఎన్నో మాటలకు పిల్లలు అర్థం తెలీక అయోమయంగా ఉండిపోతారు. వాళ్లకు వచ్చే సందేహాలెన్నో ఉంటాయి. నిత్యం ఎన్నెన్నో సందేహాలు అందరికీ వస్తుంటాయి. ఆ పని ఎందుకు చేయకూడదు? ఎందుకు అలానే చేయాలి? ఇలా ఎందుకు ఉండాలి? ఇలా ప్రతిసారి ఎన్నో సందేహాలతో సతమతమవుతారు. వాటన్నిటికీ సమాధానమూ దొరకదు. వీటిలో కొన్ని దైవ సంబదితమైనవి ఉంటాయి. మరి కొన్ని ఆచార వ్యవహారాలకు సంబంధించి ఉంటాయి. ఇంకొన్ని కెరీర్ కి సంబంధించినవీ వుంటాయి. అటువంటి సందేహాలకు సమాధానం అనేక పుస్తకాల్లో.. అక్కడక్కడ ప్రవచాకులు చెప్పగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని వరుసగా మీకోసం అందిస్తున్నాము.

భోజనానికి ముందు కళ్ళు కడుక్కోవాలా?

మన పెద్దలు భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కోవాలని చెబుతారు. ఇప్పటి స్పీడు యుగంలో డైనింగ్ టేబుల్ పై భోజనాలు చేయడం.. బఫే పధ్ధతి అంటూ నిలబడి తినడం అలవాటయ్యాకా,చలావరకో భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవడం అనే అలవాటే మర్చిపోయాం. పెద్దలూ చెప్పి చెప్పి విసుగొచ్చి మానుకున్నారు. కానీ, మంచి అలవాటు గురించి తెలుసుకోవడమూ మంచిదేగా.

పూర్వ కాలంలో..

పూర్వం ఇల్లు అంటే ఇప్పటిలా ఫ్లోరింగులు వంటివి ఉండేవి కావు. అప్పుడు పేడతో అలికిన నెల ఉండేది. ఆవు పేడతో అలికిన నెల మీద ముగ్గులు వేశేవారు. దీనివలన సూక్ష్మ క్రిములు అక్కడ చేరవని నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజమని తేలింది కూడా. ఆవుపెడలో యాంటీ బయోతిక్స్ ఉన్నాయని రుజువు అయింది కూడా. అలాంటి ఇంట్లోకి బయట నుంచి వస్తున్నపుడు మన కాళ్ళకు అంటిన సూక్ష్మక్రిములు కూడా మనతో పాటు విచ్చలవిడిగా ప్రవేశిస్తాయి. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాళ్ళు కడుక్కోవడం ద్వారా బయట నుంచి సూక్ష్మ క్రిములు మనతో పాటు లోనికి వచ్చే అవకాశాలు తగ్గి పోతాయి. అందువల్ల కాళ్ళు కడుక్కోవాలని చెప్పేవారు.

మరి ఇప్పుడో..

మంచి అనేది పూర్వ కాలం అయినా.. ఇప్పుడైనా ఒక్కటే కదా. అందులోనూ ఇప్పుడు బూతు కాళ్ళతో.. తిరగడం అలవాటైపోయింది. కాళ్ళకు వేసుకునే సాక్స్ లు చెమటతో దుర్గంధ భరితం అయిపోతాయి. అదేవిధంగా సూక్షంక్రిములు కూడా ఎక్కువగా సిద్ధం అయిపోతాయి. ఇంట్లోకి అదే కాళ్ళతో ప్రవేశించిన మనం భోజనానికి కూడా అదే కాళ్ళతో కూచుంటే..మనతో పాటు భోజనానికి కూచున్న వాళ్ళంతా ఇబ్బందిపడే అవకాశం ఉంది. కాళ్ళు కడుక్కోవడం ద్వారా కాళ్ళకు పట్టిన దుర్వాసన తొలగించుకోవడమే కాకుండా ప్రమాదకర సూక్ష్మ జీవులనూ వదిలించుకునే అవకాశం ఉంటుంది. దీంతో అందరి ఆరోగ్యానికీ ఏవిధమైన ఇబ్బందీ లేకుండా ఉంటుంది

కేవలం ఆరోగ్యపరమైన సూచన కోసమే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రమ్మని.. భోజనం చేసే ముందు కాళ్ళూ చేతులూ కడుక్కోమనీ చెబుతారు. పెద్దలు చెప్పే ఈ మంచి మాట ఎప్పటికీ ఆచరనీయమే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories