Top
logo

ఈ సంవత్సరం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందంటే..?

ఈ సంవత్సరం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందంటే..?Ugadi2020
Highlights

తెలుగు సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌య్యేది ఉగాది రోజే. ఈ పండగ తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండగ.

తెలుగు సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌య్యేది ఉగాది రోజే. ఈ పండగ తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండగ.ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండగను యుగాది అని పూర్వం పిలిచే వారు. కాలక్రమేణ అది ఉగాదిగా మారింది. ఈ ఉగాది పండగను చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకొంటారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ఈ పర్వదినాన పంచాంగ శ్రవణాలు సాగుతాయి. ఈ ఏడాది ఏ రాశి వారి జాతకం ఏ విధంగా ఉందో ఈ పంచాంగం శ్రవణం ద్వారా తెలుపుతారు. ఈ ఉగాది పర్వదినాన ఇదే ఎంతో ముఖ్యమైన ఘట్టం. అంతే కాదు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని తినడం ప్రశస్త్యమైంది. మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు.

ఇక ఈ ఏడాది శ్రీ శార్వరీ నామ సంవత్సరంలో ఏ రాశికి ఏ పలితాలు ఇస్తున్నాయో ఈ రోజున పంచాంగ శ్రవణంలో కొంత మంది పండితులు తెలిపారు. వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని పండితులు వెల్లడించారు. దాంతో పాటుగానే 12 రాశుల వారి ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానాలను తెలిపారు.

మేష రాశి:

ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1

ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక, ఆరోగ్యపరిస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ సంబంధ విషయాలు, వ్యాపారాలు కొంత నత్తనడకన నడుస్తాయి. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. దీర్హకాలికంగా పెండింగ్‌లో ఉన్న మీ దస్త్రాలపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు.

వృషభ రాశి:

ఆదాయం 14, వ్యయం - 11; రాజపూజ్యం - 06, అవమానం - 01

ఈ రాశి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ద్వితీయార్ధంలో వృత్తి, ఉద్యోగాలలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. మధ్యవర్తిత్వం చేయవద్దు. ప్రేమ వివాహాలు విఫలంమవుతాయి.

మిథున రాశి:

ఆదాయం 2, వ్యయం - 11; రాజపూజ్యం - 02, అవమానం - 04

ఈ రాశివారికి ఈ ఏడాది చాలా బాగుంది. ప్రతి విషయంలోనూ సహోదరసహోదరీ వర్గం, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. విద్యాసంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు ఎంపికవుతారు.

కర్కాటక రాశి:

ఆదాయం 11, వ్యయం - 5; రాజపూజ్యం - 05, అవమానం - 04

ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. సాంకేతిక, వ్యాపార రంగాల శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు. సాహిత్య, కళా, విద్య, పరిశోధన రంగాలవారి కృషికి తగిన గుర్తింపు, గౌరవం, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారంలో రొటేషన్‌, లాభాలు బాగుంటాయి.

సింహ రాశి:

ఆదాయం 14, వ్యయం - 2; రాజపూజ్యం - 02, అవమానం - 07

ఈ రాశివారు ఈ ఏడాది చేస్తున్న ఖర్చులు మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యవృద్ధికి ధనం ఖర్చవుతుంది. పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగానే సాగుతుంది. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు.

కన్య రాశి:

ఆదాయం 2, వ్యయం - 11; రాజపూజ్యం - 04, అవమానం - 07

కన్యారాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఆర్థికాభివృద్ధి బాగుంది. గతం కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. శుభకార్య నంబంధ విషయాలు సానుకూలపడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి.

తుల రాశి:

ఆదాయం 14, వ్యయం - 11; రాజపూజ్యం - 07, అవమానం - 07

ఈ రాశివారికి ఈ సంవత్సరం వ్యాపార సంబంధ, విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీల్లు ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాలనుకుంటారు. అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. రావలసిన బాకీలు జమ చేసుకుంటారు. బంధువర్గం ప్రతికూలంగా మాట్లాడతారు.

వృశ్చిక రాశి:

ఆదాయం 5, వ్యయం - 5; రాజపూజ్యం - 03, అవమానం - 03

ఈ రాశివారికి ఈ సంవత్సరం కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. నిరుద్యోగులు, విద్యావంతుల చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది.

ధనుస్సు రాశి:

ఆదాయం 8, వ్యయం - 11; రాజపూజ్యం - 06, అవమానం - 03

ఈ రాశివారికి ఈ సంవత్సరం పేరుప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. మహిళల వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మకర రాశి:

ఆదాయం 11, వ్యయం - 05; రాజపూజ్యం - 02, అవమానం - 06

ఈ రాశివారికి ఈ సంవత్సరం కుటుంబసభ్యులు, రక్త సంబంధీకులకు విదేశీయానం అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసం, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తించరు.

కుంభ రాశి:

ఆదాయం 8, వ్యయం - 11; రాజపూజ్యం - 06, అవమానం - 03

ఈ రాశివారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మాటలకు వక్రార్ధాలు వచ్చే అవకాశం ఉంది.

మీన రాశి:

ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2

ఈ రాశివారు ఈ సంవత్సరం భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభం పొందుతారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సహోదర వర్గం ప్రేమ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. బంధువర్గాలకు మేలుచేసినా విరోధమే మిగులుతుంది. గతంలో వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. మొండిబాకీలు వసూలవుతాయి.

గమనిక : పైన తెలిపిన రాశిఫలాలు కొంత మంది పండితులు తెలిపిన రాశిఫలాల నుంచి సేకరించబడినవి. పూర్తి వివరాలకోసం మీకు అతి సమీపంలో ఉన్న పండితులను సంప్రదించండి శార్వరీ నామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో జీవించండి.


Web TitleWhat are the Horoscopes for this year from Ugadi 2020 , Is it Good or bad
Next Story


లైవ్ టీవి