Top
logo

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు
Highlights

అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రోత్సవాలకు సిద్ధం అయింది. విజయదశమి సందర్భంగా దశ అలంకారాల్లో భక్తులకు కనువిందు చేయనున్న అమ్మవారు తొలిరోజైన ఆదివారం స్వర్ణకవచాలంకారం తో దర్శనమిచ్చారు. భక్త జనకోటి తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు.

ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. వారంతా అమ్మవారి సమక్షంలో మాలధారణ స్వీకరించారు. దీనినే భవానీ దీక్ష అంటారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.Next Story