విజయవాడలో శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం

విజయవాడలో శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
x
Highlights

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో...

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు.

పోటెత్తిన భక్తజనం..

అమ్మవారి శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుంచే భక్తులు క్యూకట్టారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లూ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories