శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి - చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథివికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.06-06 -2019 గురువారం సూర్యోదయం: ఉ.5-40; సూర్యాస్తమయం: సా.6.48 వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం ...

శుభతిథి

వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.06-06 -2019 గురువారం

సూర్యోదయం: ఉ.5-40; సూర్యాస్తమయం: సా.6.48

వసంత రుతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం

తదియ : ఉ. 09:54 తదుపరి చవితి

పునర్వసు నక్షత్రం: రా.08:29

అమృత ఘడియలు: సా. 06:13 నుంచి 07 : 44

వరకు వర్జ్యం: ఉ. 09:12 నుంచి 10:42



చరిత్రలో ఈరోజు - 06.06.2019 - గురువారం 

సంఘటనలు

శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడు ముట్టడి. 1515

శ్రీ కృష్ణ దేవ రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.

జననాలు

అజీజుద్దీన్ అలంఘీర్ 1699

మొఘల్ చక్రవర్తి. (మ.1759)

ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ 1877

ప్రముఖ మలయాళ కవి.(మ.1949)

గోపీనాధ్ బొర్దొలాయి 1890

స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (మ.1950)

కె.ఎల్.రావు 1902

ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (మ.1902)


చోడగం అమ్మన్నరాజా 1909

స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు.

చండ్ర రాజేశ్వరరావు 1915

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (మ.1994)

విక్రాల శేషాచార్యులు 1915

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, కవి.

సునీల్‌దత్ 1929

భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. (మ.2005)

దగ్గుబాటి రామానాయుడు 1936

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015)

సుత్తి వీరభద్ర రావు 1947

తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు. (మ.1988)

జాన్ బోర్గ్ 1956

స్వీడన్కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.

మరణాలు

కోరాడ రామచంద్రశాస్త్రి 1897

క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (జ.1816)

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి 1897

ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1852)

ఉప్పల వేంకటశాస్త్రి 1976

ఉత్తమశ్రేణికి చెందిన కవి. (జ.1902)

కొత్త రఘురామయ్య 1979

రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (జ.1912)

కె.ప్రత్యగాత్మ 2001

తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925)

ఆర్తీ అగర్వాల్ 2015

తెలుగు సినిమా నటీమణి. (జ.1984)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories