శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి  -  చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.01-06 -2019 శనివారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.46 వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.01-06 -2019 శనివారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.46

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

త్రయోదశి : సా.05:16 తదుపరి చతుర్దశి

భరణి నక్షత్రం: రా.00:43

అమృత ఘడియలు: రా.07:49 నుంచి 09:27 వరకు

వర్జ్యం: ఉ.10:00 నుంచి 11:38 వరకు



చరిత్రలో ఈరోజు

సంఘటనలు

అంతర్జాతీయ బాలల దినోత్సవం : (జూన్‌ 1) :1948వ సంవత్సరంలో ప్రపంచ మహి ళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి వంద దేశాలకు పైగా.. ఈ తేదీన బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి.

భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) ప్రారంభం : 1930 భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.

జననాలు

శీరిపి ఆంజనేయులు : 1891 : ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)

జరుగుల వెంకట రామ భూపాలరావు : 1944 : ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త.

బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్ : 1946 : తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు

బలరామయ్య గుమ్మళ్ల : 1953 : కలెక్టర్ మరియు వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన మంచి నటుడు కూడా.

గుమ్మా సాంబశివరావు : 1958 : ఆధునిక తెలుగు కవితా ప్రపంచంలో ఒక మేరుపర్వతం. ఆయన నిరంతర కవితా స్రవంతి.

ఎస్. వి. కృష్ణారెడ్డి : 1964 : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.

ఆకెళ్ళ రాఘవేంద్ర : 1974 : ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.

కరణం మల్లేశ్వరి : 1975 : ఆంధ్ర ప్రదేశ్కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.

మరణాలు

జేమ్స్ బుకానన్ : 1868 : అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)

మెల్విన్ జోన్స్ : 1961 : లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు.

నీలం సంజీవరెడ్డి : 1996 : భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి. (జ.1913)

బీరేంద్ర 2001 : నేపాల్ రాజు

Show Full Article
Print Article
Next Story
More Stories