3 రాష్ట్రాల్లో శ్రీ‌వారి క‌ల్యాణాలు

3 రాష్ట్రాల్లో శ్రీ‌వారి క‌ల్యాణాలు
x
Highlights

ఆంధ్రా,తెలంగాణా,కర్ణాటక రాష్ట్రాల్లో స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాలు నిర్వహించనున్న టీటీడీ

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా, సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టిటిడి శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల రేపటి నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో శ్రీ‌నివాస క‌ల్యాణాలను టీటీటీ నిర్వహించనుంది.

శ్రీనివాస కల్యాణాలు జరిగే తేదీ లు, ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి....

అనంత‌పురం జిల్లాలో...

- న‌వంబ‌రు 2వ‌ తేదీన గోరంట్ల మండ‌లం గుంత‌ప‌ల్లిలోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో, న‌వంబ‌రు 3న మ‌డ‌క‌శిర మండ‌లం రేకుల‌కుంట గ్రామంలో, న‌వంబ‌రు 4న క‌ల్యాణ‌దుర్గం మండ‌లం ల‌క్ష్మీపురం గ్రామంలో, న‌వంబ‌రు 5న ఆత్మ‌కూరు మండ‌లం పాపంప‌ల్లి గ్రామంలో, న‌వంబ‌రు 6న బుక్క‌రాయ‌స‌ముద్రం మండ‌లం కె.చెదుల్ల గ్రామంలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి...

న‌వంబ‌రు 7న క‌డ‌ప జిల్లాలో ని గాలివీడు మండ‌లం గ‌రుగుప‌ల్లి గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు

తెలంగాణా రాష్ట్రంలో...

- న‌వంబ‌రు 3న క‌రీంన‌గ‌ర్ జిల్లా మంథ‌నిలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాలలో , న‌వంబ‌రు 10, 16వ తేదీల్లో హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో, ఇక అదిలాబాద్ జిల్లాలో న‌వంబ‌రు 11న కౌతుల మండ‌ల కేంద్రంలోని కంక‌త‌ల ఆల‌య స‌మీపంలోని మినీ స్టేడియంలో , న‌వంబ‌రు 12న ద‌హేగౌన్ మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల మైదానంలో, న‌వంబ‌రు 13న తిర్యాని మండ‌లం, గంగాపూర్‌లోని శ్రీ బాలాజి వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో, న‌వంబ‌రు 14న ఇంద్ర‌వెల్లి మండ‌లం, దేవ‌పూర్ గ్రామంలోని ఓరియంట‌ల్ సిమెంట్ కంపెనీ స్టేడియంలో, న‌వంబ‌రు 15న కెరిమేరి మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల మైదానంలో శ్రీ‌వారి కల్యాణాలు నిర్వహిస్తారు.

క‌ర్ణాట‌క‌లో రాష్ట్రంలో...

న‌వంబ‌రు 24న క‌ర్ణాట‌క రాష్ట్రం, గుల్బ‌ర్గాలోని ఎన్‌వి మైదానంలో శ్రీనివాస కళ్యాణాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించనుంది.

పైన‌ తెలిపిన 14 ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల స్థానికవాసుల సహకారంతో టీటీడీ శ్రీవారి కల్యాణాలను నిర్వహించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories