శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కోసం పవిత్ర దర్భ సిద్ధం

శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కోసం పవిత్ర దర్భ సిద్ధం
x
Highlights

కోనేటి రాయడు బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతున్నాడు. టీటీడీ అధ్వర్యంలో ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభ ఉత్సవం ధ్వజారోహణం. ఈ కార్యక్రమానికి అవసరమైన సరంజామాను టీటీడీ సిద్ధం చేస్తోంది.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టమైన, అత్యంత విశేషమైన ధ్వజారోహణం కార్యక్రమం కోసం టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును సోమవారం టిటిడి డిఎఫ్‌వో డి.ఫణికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ బొక్కసం ఇన్ చార్జ్ గురురాజా రావ్ కు అందించారు....శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు.


ఈ దర్భను తిరుమలలోని కల్యాణ వేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది. ఈ దర్భను సేకరించిన తరువాత 15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 6.5 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తుతో చాపను, 200 మీటర్ల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 30 వతేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఈ నెల 30న సాయంత్రం 5:23 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories