Tholi Ekadashi 2020: ఏకాదశి ఉపవాసం ఫలితం.. ఎవరు ఆచరించాలి ?

Tholi Ekadashi 2020:  ఏకాదశి ఉపవాసం ఫలితం.. ఎవరు ఆచరించాలి ?
x
Highlights

Tholi Ekadashi 2020: ఏకాదశి పర్వదినం రోజు చాలా మంది ఉపవాసాన్ని ఆచరిస్తుంటారు. అంతే కాదు శైవులు, వైష్ణవులు కర్మసిద్ధాంతాన్ని ఆచరించే వారు

Tholi Ekadashi 2020: ఏకాదశి పర్వదినం రోజు చాలా మంది ఉపవాసాన్ని ఆచరిస్తుంటారు. అంతే కాదు శైవులు, వైష్ణవులు కర్మసిద్ధాంతాన్ని ఆచరించే వారు ప్రతి ఒక్కరు ఎలాంటి భేదభావం లేకుండా ఆచరించే వ్రతాలల్లో ఏకాదశి వ్రతం కూడా ఒకటి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఏకాదశి రోజులన ఉపవాసం ఉంది మరుసటి రోజున అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే భోజనం చేయాలి. ఈ వ్రతాన్ని ప్రతి నెల వచ్చే రెండు సార్లు వచ్చే ఏకాదశి రోజుల్లో ఆచరిస్తే మోక్షం తప్పనిసరిగా లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయని పురానాలు చెపుతుంటారు.

ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి?

ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండడం ప్రధానం. అయితే ఈ ఉపవాసం గురించి గరుడ పురాణంలో ఏం చెప్పారంటే..

ఊపోష్య ఏకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి !

కృత్వాదానం యథాశక్తి కుర్యాశ్చ హరిపూజనమ్ !!

అని చెప్పబడినది. అంటే ఉపవాసం, దానం, హరి పూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి రోజున ఉపవాసమున్నవారు ద్వాదశి రోజు ఉదయాన్నే విష్ణుపూజ చేసి ఆ విష్ణువుకి నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. ఒక వేళ విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్ర్తాలు పేర్కొన్నాయని పండితులు చెపుతుంటారు.

ద్వాదశ పారణం అంటే ఏమిటి?

పారణం అంటే ఏకాదశి వ్రతం ఆచరించి, ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి తిథినాడు భోజనం చేసే విధానం అని అర్ధం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ రోజు అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ప్రతి ఏకాదశినాడు భోజనం మాని ఉపవాసం ఉండాలని పురాణాలు చెపుతున్నాయి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి ఆ రోజు అవకాశం లేనివారు తొలి ఏకాదశినాడు ఉంటే లభిస్తుంది.

ఉపవాసం ఎవరు ఉండ కూడదు?

ఇక ఏకాదశి రోజున ఎనిమిదేండ్లలోపు పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొన్నాయి. ఇక గృహస్తులు, సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు తప్పక ఈ దీక్షను ఆచరించాలి.

ఏకాదశినాడు ఏం తినవచ్చు?

ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేనివాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories