Vastu Tips: ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు లేకుంటే చాలా నష్టాలు.. అవేంటంటే..?

Vastu Tips: ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు లేకుంటే చాలా నష్టాలు.. అవేంటంటే..?
x
Highlights

Vastu Tips: ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు లేకుంటే చాలా నష్టాలు.. అవేంటంటే..?

Vastu Tips: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. వాస్తవానికి ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదు కానీ ఆ ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించారా లేదా అనేదే ముఖ్యం. ప్రస్తుత కాలంలో వాస్తు ప్రకారం ఇల్లు నియమాలు లేకుంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా వాస్తుని విశ్వసించడం మొదలుపెట్టారు. ఎంతో ఖర్చు పెట్టి కలల ఇంటిని తయారు చేసేటప్పుడు అందం మాత్రమే కాదు వాస్తు నియమాలు కూడా పాటించాలి. ఎందుకంటే ఆనందం, శ్రేయస్సు ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటాయి. వాస్తు ప్రకారం కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.

మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలని కోరుకుంటే పూజగది కచ్చితంగా ఈశాన్యంలో ఉంచాలి. వాస్తు ప్రకారం పూజా స్థలంలో ఎప్పుడూ పూర్వీకుల ఫొటోలు ఉండకూడదు. మరణించిన వారి ఫొటోలని దక్షిణ దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ ఫోటోలు లేదా క్యాలెండర్లు ఉండకూడదు. ఇంటి లోపల ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ప్రతిరోజూ ఉదయం ఇంటి కిటికీ, తలుపులను కొంత సమయం పాటు తెరిచి ఉంచాలి. రాత్రి వేసుకున్న దుస్తులు రెండో రోజు స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించకూడదు.

వాస్తు ప్రకారం ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం తులసి మొక్క ఇంటి ముందర ఉండాలి. అదేవిధంగా వృత్తిలో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి అరటి చెట్టును నాటాలి. దానిని ప్రతిరోజూ పూజించాలి. నీటికి సంబంధించిన నియమాలు పాటించని ఇళ్లలో డబ్బు నీరులా ఖర్చయిపోతుంటుంది. వాస్తు ప్రకారం తాగునీరు ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో ఏర్పాటు చేయాలి. ఇంట్లో నీటి లీకేజీ ఉండకూడదు ఎందుకంటే ఇది ప్రధాన వాస్తు దోషం ఆర్థిక సమస్యలను దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో భూగర్భ నీటి ట్యాంక్, బోర్‌వెల్ లేదా చేతి పంపు ఏర్పాటు చేయాలంటే అది ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories