తెలుగు రాష్ట్రాల్లో మూసివేసిన ఆలయాలు

తెలుగు రాష్ట్రాల్లో మూసివేసిన ఆలయాలు
x
Highlights

నేటి అర్ధ రాత్రి 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్ర గ్రహణం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో సాయంత్రం 5 గంటల...

నేటి అర్ధ రాత్రి 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్ర గ్రహణం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో సాయంత్రం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం నిలిపివేశారు. రాత్రి 7 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగిశ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు.

విజయవాడ, కర్నూలు, వరంగల్ జిల్లాల్లో పలు ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరవనున్నారు. యాదాద్రిలో ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రేపు ఉదయం 5:30 గంటలకు సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయాన్ని తెరవనున్నారు. భద్రాచలంలో రాములోరి ఆలయాన్ని సాయంత్రం 6 గంటలకు మూసివేశారు. రేపు ఉదయం 5:30 గంటలకు సంప్రోక్షణ చేయనున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories