జీవితానికో లక్ష్యం... జీవికో గమ్యం!! జస్ట్‌ థింక్‌!!

జీవితానికో లక్ష్యం... జీవికో గమ్యం!! జస్ట్‌ థింక్‌!!
x
Highlights

ఓ లక్ష్యం ఉండాలి. మనం ఉన్నాం. జీవిస్తున్నాం. గొప్పగా జీవితాలు గడుపుతున్నాం. దేనికోసం? అర్హతలు పెంచుకోవడానికా? అన్నీ అనుభవించడానికా? అంతస్థులు...

ఓ లక్ష్యం ఉండాలి. మనం ఉన్నాం. జీవిస్తున్నాం. గొప్పగా జీవితాలు గడుపుతున్నాం. దేనికోసం? అర్హతలు పెంచుకోవడానికా? అన్నీ అనుభవించడానికా? అంతస్థులు అందుకోవడానికా? అందలాలు ఎక్కడానికా? అన్నీ సమకూర్చుకుని భోగభాగ్యాలతో అందరిలో మిన్న అని అనిపించుకోవడానికా?

వీటికోసమే మనం, మన జీవితం అని అనుకుంటే, లౌకికంగా ఏం తప్పుకాదది. ఇవన్నీ అవసరం కూడా. కాదనం. కాదనలేం. కానీ.. అంతేనా? అంతకన్నా ఇంకా, ఏమైనా ఉందా? అని విచారిస్తే, పువ్వుకి, ముత్యానికి, అలలకి, ప్రతి ప్రాణికి ఓ లక్ష్యం ఉన్నప్పుడు మరి మన మాటేమిటి? ఉత్కృష్ఠమైన మానవులమైన, మన జీవితాలకి అసలు సిసలు అయిన లక్ష్యముండాలి కదా? గమ్యముండాలి కదా? ఓ గమ్యం ఉండాలి కదా... అని మనల్ని మనమే ప్రశ్నలువేసుకుంటే, ఆ ప్రశ్నల జవాబుకోసం మనం కొంచెం లోతుగా పరిశీలించాలి. పరిశీలన చేయాలి.

మనం దివ్యాత్మలం. దివ్య చైతన్యాలం. మన స్వస్థానం ఆత్మచైతన్యమే. అక్కడ్నుంచి వచ్చేం. ఆ ఎరుక మరచి ఎక్కడెక్కడో, ఏమేమో చేస్తున్నాం. ఎన్నో బంధాలలో చిక్కుకుంటున్నాం. బందీలైపోతున్నాం. చావు పుట్టుకలమధ్య గిరగిర కొట్టుకుంటున్నాం. ఏదిఏమైనా మానవులుగా పుట్టేం కాబట్టి మళ్ళీమళ్ళీ పుట్టవల్సిన అగత్యం తెచ్చుకోకుండా జన్మరాహిత్యం పొందాలి. ఆ యోగంలోకి మనం వెళ్ళగలగాలి. అందుకోసం మనం మన జీవితకాలమంతా ఆ శుద్ధ చైతన్యంలో కలిసిపోడానికి ప్రయత్నించాలి. ఆ శుద్ధచైతన్యంగా మిగిలిపోవడానికి ప్రయత్నం చేయాలి. శుద్ధ చైతన్యంలా మిగిలిపోవాలి. నిలచిపోవాలి లయమై పోవాలి. ఆ అమరత్వ సిద్ధిపొందటమే- మన జీవిత లక్ష్యం. జీవన తత్త్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories