సూర్యప్రభ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

సూర్యప్రభ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
x
Highlights

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య...

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో స్వామివారికి ఏకాంతంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజుల బ్రహోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం, రెండో రోజు శేషవాహనం పైన ఊరేగించారు. అదేవిధంగా మూడో రోజు ఉదయం సింహవాహన సేవ, నాలుగవ రోజు కల్పవృక్ష వాహనంపై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకున్ని ఊరేగించారు. అదే విధంగా ఐదవ రోజు ఆ మలయప్ప స్వామివరు భక్తులకు మోహిని అవరతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం సాయంత్రం వేల స్వామివారు గరుడవాహనంపై ఊరేగారు. అదే విధంగా ఆరో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చి కనువిందు చేసారు.

ఇకబ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీ మంత్రంతో సూర్య భగవానుడు దేదీప్యమానుడై వెలుగొందారు. ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగగా స్వామి రథసారథి అనూరుడు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహించాడు. సూర్యప్రభపై తిరుమలేశుడి దర్శనంతో ఆరోగ్యం, ఐశ్వర్య భాగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక ఇదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడంతో మాఢవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆలయంలోనే చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories