Surya Namaskar: సూర్య నమస్కారంతో సూపర్ బెనిఫిట్స్..!

Surya Namaskar
x

Surya Namaskar: సూర్య నమస్కారంతో సూపర్ బెనిఫిట్స్..!

Highlights

Surya Namaskar: ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా? రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి యోగాలోని సూర్య నమస్కారం చేస్తే అద్భుతమై ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Surya Namaskar: ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా? రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి యోగాలోని సూర్య నమస్కారం చేస్తే అద్భుతమై ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సూర్య నమస్కారం శరీరానికి యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఉదయం పూట సూర్య నమస్కారం చేయడం వల్ల ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చురుకుదనం, ఏకాగ్రత, మానసిక స్పష్టతను పెంచుతుంది. అయితే, సూర్య నమస్కారాన్ని రోజులో ఏ సమయంలో చేయాలి? దీని వల్ల ఏలాంటి ఫలితాలు ఉంటాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..

బలం

సూర్య నమస్కారంలోని 12 ఆసనాలు శరీరంలోని కండరాలు, కీళ్లను సాగదీసి బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల వెన్నెముక బలపడుతుంది. చేతులు, కాళ్ళు, కండరాలు బలపడతాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో లేదా ఉదయం 6-7 గంటల మధ్య సహజ కాంతి ఉన్న ప్రదేశంలో సూర్య నమస్కారం చేయండి. ఇది దీర్ఘకాలిక నొప్పిని నిర్వహించడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని మరింత చురుగ్గా, ఫిట్‌గా చేస్తుంది.

గుండె ఆరోగ్యం

సూర్య నమస్కారం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా, మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఇలా చేయడం వల్ల ఎక్కువ కొవ్వును కరిగించవచ్చు. కాలక్రమేణా, ఇది రక్తపోటును తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం, గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories