Sundarakanda Akhanda Parayanam: ఆగస్టు 27 న సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

Sundarakanda Akhanda Parayanam:  ఆగస్టు 27 న సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం
x

Sundarakanda Akhanda Parayanam 

Highlights

Sundarakanda Akhanda Parayanam: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆగస్టు 27వ తేదీ గురువారం సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నా

Sundarakanda Akhanda Parayanam: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆగస్టు 27వ తేదీ గురువారం సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 8వ సర్గ నుంచి 11వ సర్గ వరకు ఉన్న 182 శ్లోకాలను అఖండ పారాయణం చేయనున్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠం, వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద పారాయణ దారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొననున్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి తిరుమ‌ల‌ నాద నీరాజ‌నం వేదిక‌పై టీటీడీ "యోగ‌వాశిష్ఠం - శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం‌ పారాయణం నిర్వహించింది. భక్తులకు శ్రీవారి దర్శనం పునః ప్రారంభమైన జూన్ 11వ తేదీ సుంద‌రకాండ పారాయణం ప్రారంభించింది.

జూలై 7 వ తేదీ సుందరకాండ తొలి సర్గ లోని 211 శ్లోకాలతో అఖండపారాయణం నిర్వహించారు. ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న 227 శ్లోకాలతో ఆగస్టు 6వ తేదీ అఖండ పారాయణం నిర్వహించారు. 27వ తేదీ గురువారం మరోసారి అఖండ పారాయణం జరుపనున్నారు. కాగా టీటీడీ ప్రచురించిన సుందరకాండ పారాయణం పుస్తకంలో మొత్తం 68 సర్గలు 2821 శ్లోకాలు ఉన్నాయి.ఎస్వీబీసీ ప్రతిరోజూ ఇస్తున్న ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు ఈ పారాయ‌ణం లో పాల్గొని విశేషంగా ఆదరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories