శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
x
Highlights

ఇల వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో 9 రోజుల పాటు వైభవోపేతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ...

ఇల వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో 9 రోజుల పాటు వైభవోపేతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు...ముందుగా స్వామివారి సర్వసైన్యాధక్షుడు శ్రీవిష్వక్సేనులు వారి సర్వాలంకార భూషితుడే బంగారు తిరుచ్చిపై మాడా వీధుల్లో ఊరేగి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.


అనంతరం ఆలయంలోని యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు....వైఖానస ఆగమశాస్త్రంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ఏదైనా ఉత్సవానికి 9 రోజుల ముందుగానీ, ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందుగానీ అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు ద్వారా తెలుస్తొంది..ఇక సోమవారం 5 గంటలకు జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి, రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు...అనంతరం 8 గంటలకు పెద్దశేష వాహనంతో వాహనసేవలు మొదలుకానుంది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories