వైభవంగా బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు

వైభవంగా బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు
x
Highlights

ఈ రోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్దానములో మహామండపము 7 వ అంతస్తు లో వైభవంగా సామూహిక అక్షరభ్యాసములు నిర్వహించారు. ఉదయము 8-22 నిలకు మూహుర్త...

ఈ రోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్దానములో మహామండపము 7 వ అంతస్తు లో వైభవంగా సామూహిక అక్షరభ్యాసములు నిర్వహించారు. ఉదయము 8-22 నిలకు మూహుర్త సమయమున కార్యక్రమం జరిపించారు. అక్షర దీవెన కార్యక్రమమునకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి వారు వి.కోటేశ్వరమ్మ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనాధ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించిన మంత్రి శ్రీనివాస్, దేవస్థానం తరుపున పూజ సామాగ్రి, స్కూల్ బ్యాగ్, పెన్, శ్రీ అమ్మవారి పాకెట్ ఫోటో, కంకణం, శ్రీ అమ్మవారి ప్రసాదము విద్యార్ధులకు అందజేశారు. శ్రీ అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారములో మహామండపము 7 వ అంతస్తులో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చినారు. భక్తులతో 7 వ అంతస్తు మొత్తం నిండి కన్నుల విందుగా కార్యక్రమము జరిగినది. సామూహిక అక్షరభ్యాసములో 500 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. విద్యార్ధులతొ పాటుగా తల్లి దండ్రులు మరియు అధికారులు, కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమములో దేవస్ధాన ప్రధాన అర్చకులు, యల్.దుర్గా ప్రసాదు, స్ధానా చార్య, శివ ప్రసాద్ శర్మ, కోట ప్రసాద్, ఆర్.శ్రీనివాసశాస్త్రి , వైదిక కమిటీ సభ్యులు , ఆలయ అర్చక సిబ్బంది, దేవస్ధాన స్పెషల్ డ్యూటీలు చేయు సిబ్బంది ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories