అప్పన్న వెలసిన క్షేత్రం... సింహాచలం

విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం....
విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా చెబుతున్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుంది.
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురాని ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.
సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.
లైవ్ టీవి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
5 Dec 2019 5:10 PM GMTIndia vs West Indies : కొత్త రూల్ ఇదే
5 Dec 2019 4:23 PM GMTఉల్లి సమస్య త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది
5 Dec 2019 4:15 PM GMTక్వీన్ ట్రైలర్ : రమ్యకృష్ణపై ప్రశంసల వెల్లువ
5 Dec 2019 3:22 PM GMTముగిసిన కర్ణాటక ఉపఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని ఆ...
5 Dec 2019 2:48 PM GMT