Top
logo

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
Highlights

అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచారు. మొత్తం అన్ని ...

అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచారు. మొత్తం అన్ని సేవలకూ సంబంధించి 55,355 టికెట్లు అందుబాటులో పెట్టారు. ఇందులో సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళ పాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి. అదేవిధంగా జనరల్ కేటగిరీలో విశేషపూజ 1500, కల్యాణం 10,450, ఊంజల్‌ సేవ 3,300, ఆర్జిత బ్రహ్మూత్సవం 6,050, వసంతోత్సవం11,550, సహస్ర దీపాలంకార సేవ 13,200 టికెట్లు ఉన్నాయి. టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

Next Story


లైవ్ టీవి