Shani Trayodashi 2026: రేపు శని త్రయోదశి .. శని పీడల నుంచి బయటపడాలంటే ఈ విధంగా చేయండి

Shani Trayodashi 2026: రేపు శని త్రయోదశి .. శని పీడల నుంచి బయటపడాలంటే ఈ విధంగా చేయండి
x

Shani Trayodashi 2026: రేపు శని త్రయోదశి .. శని పీడల నుంచి బయటపడాలంటే ఈ విధంగా చేయండి

Highlights

Shani Trayodashi 2026: జనవరి 31న మాఘ మాస శని త్రయోదశి. ఈ రోజు శని పూజ, శివాభిషేకం చేస్తే శని దోషాలు, డబ్బు సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు తొలగుతాయని పండితుల సూచన.

Shani Trayodashi 2026: జనవరి 31న మాఘ మాస శని త్రయోదశి సందర్భంగా శని పీడలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఇతర మాసాల్లో వచ్చే శని త్రయోదశితో పోలిస్తే, విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన మాఘ మాసంలో వచ్చే శని త్రయోదశి మరింత శక్తివంతమైనదిగా భావిస్తారు. శని దేవుడు విష్ణుభక్తుడైనందున ఈ రోజు చేసే పూజలు, పరిహారాలకు ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.

ఈ శని త్రయోదశి రోజున ప్రాతఃకాలంలో నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనేశ్వరుడిని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పండితులు సూచిస్తున్నారు. డబ్బు సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలని, శత్రు బాధలు, దిష్టి ప్రభావం ఉన్నవారు ఆవాల నూనెతో శనిని పూజించాలని చెబుతున్నారు.

శనికి నీలం రంగు పూలు ప్రీతికరమైనవి కావడంతో, అభిషేకం అనంతరం శని విగ్రహం పాదాల వద్ద నీలం పూలు, నల్ల నువ్వులు లేదా రాళ్ల ఉప్పు సమర్పించడం శుభఫలితాలను ఇస్తుందని నమ్మకం. అలాగే ‘ఓం శం శనైశ్చరాయ నమః’ మంత్రాన్ని జపిస్తూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలని సూచిస్తున్నారు.

శని త్రయోదశి రోజున సాయంత్రం 5.15 నుంచి 5.45 మధ్యలో ఉండే ప్రత్యేక కాలంలో శివాభిషేకం చేస్తే శని పీడల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని పండితులు తెలిపారు. ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే పడమర దిశలో శని దీపం వెలిగించి, నువ్వుల నూనెతో ఎనిమిది ఒత్తులతో దీపారాధన చేయవచ్చని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories