శబరిమల యాత్ర చేయాలనుకుంటే ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!

శబరిమల యాత్ర చేయాలనుకుంటే ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!
x
Highlights

Sabarimala Yatra : మాల ధారణ ఒక్కటే ఈసారి స్వామి అయ్యప్ప దర్శనానికి సరిపోదు. కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటిస్తేనే శబరిమల యాత్ర చేయగలుగుతారు.

కరోనా మాహమ్మరి ఇంకా మనల్ని వదిలి పోలేదు. ఇప్పుడిప్పుడే అంతా మామూలుగా అవుతోంది. అన్ని వ్యవస్థలూ గాడిన పడుతున్నాయి. అయితే, దైవ దర్శనాల విషయంలో మాత్రం ఎక్కడిక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో భక్తుల సంఖ్యకు పరిమితి విధించి దర్శనాలు కల్పిస్తున్నారు. ముందస్తుగా దైవ దర్శనం కోసం టోకెన్లు తీసుకోవడం.. టికెట్లు కొనుక్కోవడం వంటి విధానాలతో భగవంతుని దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

ఇక దేశవ్యాప్తంగా కార్తీక మాసం నుంచి మొదలయ్యే స్వామి అయ్యప్ప దీక్షలకూ ఈ సంవత్సరం ఆంక్షల బాధ తప్పేలా కనిపించడం లేదు. స్వామి మాల వేసుకున్నాం.. మండల కాలం దీక్ష వహించాం. నియమాలు పాటించాం అయ్యప్ప దర్శనం కోసం శబరిమల బయలు దేరుదాం అంటే ఈ సంవత్సరం ఎప్పటిలా కుదరదు. గుంపులు గుంపులుగా అయ్యప్ప పాటలు పాడుతూ.. శబరిమల యాత్ర చేద్దామంటే అసలు కుదరదు. అయ్యప్ప దీక్ష చేపట్టే భక్తులు.. అయ్యప్ప దర్శనానికి రావాలంటే ఏం చేయాలనే విషయాల్ని ట్రావన్ కోర్ దేవస్థానం స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహ్తా గురువారం ఒక లేఖను రాశారు. ఆ లేఖలో పేర్కొన్న దాని ప్రకారం స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్ళే వారు విధిగా ఈ క్రింది నిబంధనలు పాటించాల్సిందే!

- ఈ సంవత్సరం శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం ఉండదు.

- పంబ నదిలో స్నానాలను నిషేధించారు.

- వర్చ్యువల్ క్యూ పోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. దీనికోసం https://sabarimalaonline.org వెబ్ సైట్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

- మామూలు రోజుల్లో వెయ్యి మందికి.. వారాంతాల్లో రెండువేల మందికి రోజుకు అయ్యప్ప దర్శనం కల్పిస్తారు.

- 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనం ఉండదు.

- ఇక దర్శనానికి 48 గంటల ముందు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారనీ, అందుకు అనుగుణంగా భక్తులు తమ దర్శనానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆ లేఖలో కేరళ సిఎస్ విశ్వాస్ మెహ్తా సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories