సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగనున్న శ్రీవారు

సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగనున్న శ్రీవారు
x
Highlights

రథ సప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి కైకర్యాలను నిర్వహించారు.

రథ సప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి కైకర్యాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో వారం రోజుల పాటు ఇక్కో వాహణం పైన శ్రీవారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించినట్టుగానే, రథసప్తమి రోజున ఒకే రోజు అన్ని వాహన సేవలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మరో రెండు వాహనాల మీద శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నాడు. సమస్త భక్త జనావళికి దర్శనం ఇచ్చి కనువిందు చేయనున్నాడు.

సర్వభూపాల వాహనం(సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు)

సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు అష్ట దిక్కులకు, సమస్త జగత్తుకూ రారాజు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందిరినీ శ్రినివాసుడు పాలిస్తున్నాడు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై ఎక్కించుకుని, హృదయంలో కొలువుంచుకుని మళయప్పస్వామిని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.

చంద్రప్రభ వాహనం(రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు)

చంద్రుడు శివుని శిరస్సులో శిరోభూషణంగా ఉంటాడు. అదే విధంగా ఇక్కడ శ్రీహరికి కూడా వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కోనేటిలో కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. వారి జన్మలు చరితార్థమవుతుంది. భక్తుల కళ్లు వికసించి, భక్తుల హృదయాల నుండి అనందరసం ఉప్పొంగుతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories