
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆచార్య రుత్విక్‌వరణాన్ని...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆచార్య రుత్విక్‌వరణాన్ని అర్చకస్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు అప్పగించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలిసి, తెలియక జరిగే కొన్నిదోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 తతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. దీనిని 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మూడు రోజులపాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు పలు పూజలు, సేవలను సేవలను టీటీడీ రద్దు చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



