శుభతిథి - చరిత్రలో ఈరోజు

శుభతిథి -  చరిత్రలో ఈరోజు
x
Highlights

శుభతిథి శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.27 -05 -2019 - సోమవారం సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.45 వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ...

శుభతిథి


శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.27 -05 -2019 - సోమవారం

సూర్యోదయం: ఉ.5-41; సూర్యాస్తమయం: సా.6.45

వసంత రుతువు - వైశాఖ మాసం - బహుళ పక్షం

అష్టమి : ప.11:16 తదుపరి నవమి

శతభిష నక్షత్రం: సా. 04:13

అమృత ఘడియలు: ఉ. 8:08 నుంచి 9:56 వరకు

వర్జ్యం: రా. 11:21 నుంచి తె. 1:08 వరకు



చరిత్రలో ఈరోజు

సంఘటనలు

రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం : 1934 : రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.

తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా : 1964 : భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.

జననాలు

ఇబ్నె ఖుల్దూన్ : 1332 : ప్రసిద్ధ చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త, మరియు రాజకీయ వేత్త. (మ.1406)

దీపాల పిచ్చయ్య శాస్త్రి : 1895 : ప్రముఖ కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)

ఒ.ఎన్.వి.కురుప్ : 1931 : మలయాళంలో ప్రసిద్ధ కవి, సినీ గేయకర్త.

విజయభాస్కర్ ధీర్ఝాసీ : 1960 : ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.

రవిశాస్త్రి : 1962 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

అంకిత : 1982 : రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.

మరణాలు

రాబర్ట్ కాక్ : 1910 : ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

కందుకూరి వీరేశలింగం పంతులు : 1919 : భారత దేశ ప్రముఖ సంఘ సంస్కర్త. (జ.1848)

పళని సుబ్రహ్మణ్య పిళ్ళ : 1962 : ప్రముఖ మృదంగ విద్వాంసుడు.

జవహర్‌లాల్ నెహ్రూ : 1964 : భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)

సాలూరు హనుమంతరావు : 1980 : ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)

సంపత్ కుమార్ : 1999 : ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (జ.1927)

Show Full Article
Print Article
Next Story
More Stories