ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోవద్దంటారు ఎందుకు?

ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోవద్దంటారు ఎందుకు?
x
Highlights

ఉత్తరం వైపు తల పెట్టు కొని నిద్రపోకుడదు... అని తరచు పెద్దవాళ్ళు చెప్పే మాట ఇది. ఆయుఃక్షీణమని పురాణేతిహాసాలలో ఆనేక కధలు ఉన్నాయి. మన వైద్యశాస్త్రం...

ఉత్తరం వైపు తల పెట్టు కొని నిద్రపోకుడదు... అని తరచు పెద్దవాళ్ళు చెప్పే మాట ఇది. ఆయుఃక్షీణమని పురాణేతిహాసాలలో ఆనేక కధలు ఉన్నాయి. మన వైద్యశాస్త్రం మాత్రం కొన్ని శాస్త్రీయ ఆధారాలను చూపుతుంది. ఉత్తరం వైపు తల పెట్టి పడుకొంటే రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొన్ని పరిశోధనల్లో తేలిందట. ఎందుకు అంటే.. భూమధ్య రేఖ నుంచి 40 డిగ్రీల అక్షాంశం దాక ఆకర్షణ శక్తి ఎక్కువు గా ఉంటుంది. ఉత్తర ధృవం సమీపించే కొద్దీ ఇది తగ్గుతుంది. మన దేశం 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం రేఖ మధ్య ఉంది. కాబట్టి ఈ ఆకర్షణ శక్తి ప్రభావం ఇంకా ఎక్కువుగా ఉండవచ్చు .

ఈ సూత్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం దిక్కుకు ఆకర్షణ శక్తి ప్రవహిస్తుంటుంది. దీని వల్ల శరీరం లొ కొన్ని మార్పులు చోటు చేసుకొంటాయి. దీంతో కొన్ని రసాయనాలు తయారయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ప్రకృతి సిద్దమైన నిరంతర ప్రక్రియ. మన శరీరంలో ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి లోహ పదార్దాలు ఉంటాయి. వీటి ఫై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. ఉత్తరం దిక్కుగా తలపెట్టినప్పుడు మెదడు, అరికాళ్ళు దగ్గర ఈ పదార్ధాలు ధృవలు గా యేర్పడతాయి. దీనితో సహజసిద్దమైన ఆకర్షణ శక్తి శరీరం లోకి ప్రవేశించకుండా అడ్డుపడతాయి. దీని వల్ల శరీరంలో బాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా, రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. మనిషి తొందరగా రోగాల బారిన పడుతాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories