తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, కొనసాగుతున్న మేఘావృత వాతవరణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, కొనసాగుతున్న మేఘావృత వాతవరణం
x
Highlights

♦ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ♦ వెంకన్న దర్శనానికి 6 గంటల సమయం

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

ఇవాళ బుధవారం అక్టోబర్ 23 న మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం..గరుడాళ్వార్ మండపంలో స్వామివారి ప్రతిరూపమైన భోగశ్రీనివాసుడు ఉత్సవమూర్తికి సహస్ర కళశాభిషేకం అనే విశేషమైన వారపు సేవను అర్చకులు నిర్వహించారు...

ఇక రద్దీ తక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 6 గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయంలో స్వామివారి దర్శనభాగ్యం పొందుతున్నారు.

నిన్నటి రోజు మంగళవారం అక్టోబర్ 22 న 61,958 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 2.87 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories