ఓంకారం... ఇదో జగన్నినాదం

ఓంకారం... ఇదో జగన్నినాదం
x
Highlights

సాక్షాత్తు శివుని ప్రతిరూపంగా కొలుస్తారు జనసామాన్యులు. హిందువులకు పరమ పవిత్రమైన ఓంకారనాదం... ఇప్పుడు జగమంతా వినిపిస్తోంది. ఎల్లెడెలా ధ్వనిస్తోంది....

సాక్షాత్తు శివుని ప్రతిరూపంగా కొలుస్తారు జనసామాన్యులు. హిందువులకు పరమ పవిత్రమైన ఓంకారనాదం... ఇప్పుడు జగమంతా వినిపిస్తోంది. ఎల్లెడెలా ధ్వనిస్తోంది. హిమాలయ పర్వత పర్యంతం ప్రతిధ్వనిస్తోంది. ఆ నాదాన్ని.. నినాదాన్ని హిందూ బంధువులందరికీ వినిపించాలన్న సత్సంకల్పంతో శివ సాక్షాత్కార స్వరూపంగా భావిస్తూ ఓంకారం.. లోకానికి పరిచయం అయింది. ఓంకారం వెబ్‌సైట్‌తో బాంధవులందరి దరికి హిందూయిజాన్ని చేర్చాలన్న సంకల్పమే ఒక సాహసమని చెప్పాలి. ఎందుకుంటే ఇప్పుడు ఆధ్యాత్మికత పెరిగిపోయింది... ఆధ్యాత్మిక ప్రవచనాలూ పెరిగిపోయాయ్. ప్రజల్లో భక్తిభావమూ వెల్లివరిస్తోంది. గుడులు, గోపురాలు, ప్రవచనాలు మిన్నంటుతున్నాయ్. ఇలాంటి సమయంలో ప్రతి హిందువు ఇంటి గడపను పలకరించేందుకు సిద్ధమైంది ఓంకారం.

పాశ్చాత్య సంస్కృతి మాయలో పడిపోయి.. పాశ్చాత్య సంప్రదాయాల భ్రమలో ముగిగిపోయి.. హిందూయిజాన్ని నిజంగా మరిచిపోతున్నామన్న భావన ప్రతీ ఒక్కరిలో ఉంది. ఎందుకంటే మన పాత ఆచారాలేంటి? మన పురాతన సంప్రదాయాలేంటి? అంతకుమించి మన రుషులు, సిద్ధులు, మహర్షులు మనకందించిన సంస్కృతి ఏంటన్న విషయాలు దాదాపు కనుమరుగువుతూనే ఉన్నాయ్. దాదాపు ప్రతీ చోట దాని ప్రభావం ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంది.

అలాంటి మాయ నుంచి హిందూయిజాన్ని బయటకు తెప్పించే అతి పెద్ద సాహసమే ఓంకారం. ఇప్పటికే దేశ, విదేశాల్లో హిందూ సంస్కృతిని... కంప్యూటర్ల ద్వారా వివరిస్తూ... వినిపిస్తూ... ప్రతిధ్వనిస్తున్న ఓంకారం కొత్త ఏడాది అంటే 2016 నుంచి హిందు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఓ డైరీని అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే సుమారు 80 వేల కాపీలతో ముద్రించబడి సిద్ధంగా ఉన్న ఓంకారం డైరీ మాకూ కావాలంటూ ... విదేశాల్లో ఉన్న మన హిందూ బంధువులు ఇప్పటకే ఆర్డర్‌ కోసం మాకు మెయిల్స్‌ పంపుతున్నారు. ఇది మాకెంతో ఆనందంగా ఉంది.

ముఖ్యంగా హిందూభావజాలమే ప్రతిబింబించేలా మా ఈ డైరీని రూపొందిస్తున్నాము. ప్రతిఒక్కరి ఇంట్లో దైవపూజకు ఉపయోగపడేలా మా డైరీ ఉంటుందనడంలో సందేహమే లేదు. దైవారాధన కోసం, నిత్య పూజల కోసం, సమస్యల పరిష్కారాల కోసం, గట్టెక్కించే మార్గాలను, దానికి తగ్గ శ్లోకాలను అర్థపూర్వకంగా మీకందించాలన్నదే మా ప్రయత్నం. ప్యాకెట్‌ క్యాలెండర్‌ తరహాలో... దైవభక్తి పరాయణులకు మా డైరీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే మేము ఆశిస్తున్నాం. దానికి మీ ఆశీర్వాదం కావాలని అభిలషిస్తున్నాము.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories