మంత్ర మహాత్మ్యం చెబుతున్న నిజాలేంటి?

మంత్ర మహాత్మ్యం చెబుతున్న నిజాలేంటి?
x
Highlights

మంత్ర శక్తి ఎలా కలుగుతుంది? కేవలం ఒక మంత్రాన్ని లక్షల సార్లు ఉచ్చరించడం వల్లనే అయితే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపం చేసేలా పెడితే సరిపోతుందా? ప్రార్ధనలు...

మంత్ర శక్తి ఎలా కలుగుతుంది? కేవలం ఒక మంత్రాన్ని లక్షల సార్లు ఉచ్చరించడం వల్లనే అయితే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపం చేసేలా పెడితే సరిపోతుందా? ప్రార్ధనలు మామూలు మానవభాషలో ఉంటాయి. వాటికంటే దివ్యలోకాల నుంచి వినబడిన మంత్రాలు శక్తివంతమైనవి. అలా విన్న వారిని ద్రష్టలు అంటున్నాం. మంత్రాలు బీజాక్షర నిర్మితాలు. అంటే ఏ అక్షరం ఎక్కడ వుండాలో అలా వున్నవి అన్న మాట. ప్రపంచంలో అనేక మతాలలో ఈ మంత్రాలు, అంటే దివ్య శబ్దాలు వున్నాయి. బుద్ధిజంలో పాళీ భాషలో, హిందూ మతంలో సంస్కృతంలో, క్రైస్తవమతంలో హిబ్రూ, లాటిన్ భాషలలో, ఇస్లాంలో అరబిక్ భాషలో దివ్యశబ్దాలు వున్నాయి. దేవదత్తాలుగా భావించబడుతున్నాయి. వాటి స్వరూపం, వినియోగం భిన్నంగా వుండొచ్చు.

అందుకే మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఉచ్చారణ సరిగా వుండడం, తగినంత శ్రద్ధతో చెయ్యడం అవసరం. చాలా మంది పదాలని తుంచిగాని, తొందర తొందరగా గాని, తప్పులతో గాని చేస్తూ వుంటారు. దీనివల్ల తగిన ఫలితాలు త్వరగా రావని శాస్త్రం చెపుతోంది. మంత్రాన్ని గురుముఖంగా నేర్చుకోవలసినదిగా అందుకే చెప్పడం జరిగింది.

మంత్ర శక్తితో బాటు జంటగా రెండు ప్రధానమైన విషయాలున్నాయి అని అనేక మంత్రశాస్త్ర గ్రంధాల సారం. 1. భక్తి : ఇది సాధకుడిని దివ్య శక్తితో అనుసంధానంగా వుంచుతుంది. భక్తి ఒక బీజం లాంటిది. 2. మంత్ర శక్తి: ఇది కొలవడానికి కొలమానంలేదు, ప్రత్యక్షానుభూతి కావాలంటే సిద్ధులు రావాలి. పరోక్షానుభూతి సాధ్యమే! 3. దేవతానుగ్రహం : ఇక్కడ సాధకుడి వ్యక్తిత్వం, పూర్వ జన్మ సంస్కారాలు, ఈ జన్మలో కర్మలు అన్నిటిని బట్టి ఇది వుంటుంది. కొందరు గురు అనుగ్రహంతో దేవతను కూడా మెప్పించగలుగుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories