Top
logo

మామిడి చెట్టు కింద వెలసిన స్వామి.. ఎక్కడో తెలుసా..?

మామిడి చెట్టు కింద వెలసిన స్వామి.. ఎక్కడో తెలుసా..?
X
Highlights

ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడులోని కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు.

ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడులోని కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఆలయాలలోనే ఒకటి.

ఏకాంబరేశ్వరుని విశిష్టత:

ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయంలో మూలవిరాట్ విగ్రహం 300 ఏళ్ళనాటిది.


ఆలయ విశేశాలు:

ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి.

సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.

మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు.ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునిలథింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి ఉన్నది.


ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్ని ని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువు ను ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ.

తరువాత శివుడు పార్వతి మీదకు గంగ ను ప్రవహింప జేయగా, పార్వతి గంగను ప్రార్థించి, వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువు ను వామనమూర్తిగా పూజిస్తారు.

ఆలయం ఎక్కడ ఉంది...

తమిళనడు రాష్ట్రం కాంచీపురం జిల్లా బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో పలార్ నది ఒడ్డున ఉంది. అంతే కాదు ఈ పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వరుడు, కంచి కామాక్షి ఆలయాలు, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి.

సాహిత్యం-సంగీతం:

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముద్దుస్వామి దీక్షితులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూర్వికల్యాణి రాగంలో ఏకామ్రనాథం భజేహం, భైరవి రాగం లో చింతయమా కందమూల కందం అను కృతులను రచియించారు.


ఆలయ వేళలు:

ఉదయం 6 గంటలు మొదలు మధ్యాహ్నం 12.30 వఱకు సాయంత్రం 4 గంటలు మొదలు రాత్రి 8.30 వరుకు ఆ పరమాత్ముడు దర్శనం ఇస్తాడు.

ఎలా చేరుకోవచ్చు..

రోడ్డు మార్గం: తిరుపతి, కర్నూలు, కడప మీదుగానైతే 12గంటలలో చేరవచ్చును. తిరుపతి శ్రీనివాసుని కూడా ఈ మార్గంలో మీరు దర్శించుకొనవచ్చును.

వాయు మార్గం: హైదరాబాద్ నుండి నెల్లూరు మీదుగా చెన్నై విమానాశ్రయంలో దిగి అక్కడనుంచి కాంచీపురం చేరవచ్చును.Web TitleKanchipuram Ekambareswarar temple history and importance
Next Story