IRCTC Tour : రామాయణ యాత్ర... హైదరాబాద్ టు శ్రీలంక

IRCTC Tour : రామాయణ యాత్ర... హైదరాబాద్ టు శ్రీలంక
x
Highlights

రామ నామం వింటేనే చాలు భక్తులు తన్మయంలో పొంగిపోతారు. అలాంటిది ఆ శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను చూడాలని ఎవరికుండదు.

రామ నామం వింటేనే చాలు భక్తులు తన్మయంలో పొంగిపోతారు. అలాంటిది ఆ శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను చూడాలని ఎవరికుండదు. అలాంటి భక్తుల కోసం IRCTC ( ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ) ఒక మంచి యాత్ర టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీతో ఎక్కడో శ్రీలంకలో ఉన్న రాముడు తిరిగిన ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించింది.

ఈ టూర్ ను IRCTC 2020 మార్చి 27న హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలైన కొలంబో, డంబుల్లా, కాండీ, నెగొంబాకు తీసుకెళ్తుంది. ఈ యాత్రలో భాగంగా మార్చి 27, 2020 నాడు ఉదయం 10:15 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీలంక చేరుకుంటారు.

4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీలో మొదట మునీశ్వరం, మనవేరి ఆలయాల మీదుగా డంబుల్లాకు తీసుకెళ్తారు. ఆ రోజున అక్కడే బస చేసి మార్చి 28న ట్రింకోమలీకి తీసుకెళ్తారు. అక్కడ చూడదగ్గ ఆలయాలైన తిరుకోనేశ్వర్, లక్ష్మీనారాయణ ఆలయాలను సందర్శించిన తరువాత శ్రీలంకలోనే అతిపెద్ద హిల్ స్టేషన్ అయిన కాండీకి తీసుకెళ్తారు. అక్కడ ఎంతో ప్రఖ్యాతి గాంచిన జెమ్స్ ఫ్యాక్టరీ, గౌతమ బుద్ధ ఆలయాన్ని సందర్శించిన తర్వాత రాత్రికి కాండీలోనే బస ఏర్పాట్లు చేస్తారు.

మార్చి 29న నువారాఏలియా, రాంబోడాలో శ్రీ భక్త హనుమాన్ ఆలయం, సీతా అమ్మన్ ఆలయం, సీతా ఏలియా, అశోక వాటికలను చూపించనున్నారు.

మార్చి 30న కొలంబోకు బయల్దేరి కొలంబో సిటీకి చేరుకుంటారు. అనంతరం మార్చి 31న ఉదయం 07:25 గంటలకు శ్రీలంకలో ఫ్లైట్ ఎక్కితే 09:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని దీంతో ఈ టూర్ ముగుస్తుందని IRCTC తెలిపింది.

ఇక ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.39,250 గా ఉంది. ఈ యాత్రలో నాలుగు రాత్రులు త్రీ స్టార్ హోటల్‌లో బస, వీసా ప్రాసెసింగ్ ఫీజులు, ఆలయాల సందర్శన, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీని https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో బుక్ చేయాలి.

టూర్ వివరాల లింక్



Show Full Article
Print Article
More On
Next Story
More Stories