చనిపోయిన వారిని బ్రతికించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

చనిపోయిన వారిని బ్రతికించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
x
Highlights

పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు. అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముగు అర్జునునికి హితబోధ చేస్తారు.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।

తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి

పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు. అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముగు అర్జునునికి హితబోధ చేస్తారు.

నిజమే ఈ విశ్వంలో ప్రతి ప్రాణకోటి పుట్టడం గిట్టడం సహజం. కానీ ప్రతి జీవి బతికున్న రోజుల్లో ఏం సంపాదించాలి, ఎలా తన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, తన ప్రాణాలకు ఎలా కపాడుకోవాలి అంటూ ప్రయత్నాలు చేస్తాడు. అయినా ఏదో ఒక రోజు మనిషి ప్రాణం ఖచ్చితంగా పోతుంది, అది సృష్టి నియమం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఖర్చు పెట్టినా మనిషి చావు చెర నుంచి తప్పించుకోలేడు. ఆత్మ ఆ పరమాత్మలో కలవక తప్పదు. కానీ మనిషి ఎంతగానో ఇష్టపడే తన ప్రాణంపోకుండా ఆపితే, పోయిన మనిషి ప్రాణం తిరిగి వస్తే ఎంతటి ఆశ్చర్యం.


వింటుంటేనే ఒల్లు గగుర్లు పొడుస్తుంది కదా. అసలు అది సాధ్యమేనా అనుకుంటున్నారు కాదా. అవును అది నిజమే. చనిపోయిన మనిషిని కొన్ని నిమిషాల పాటు బతికించగలిగే శక్తి ఈ భూమిపై ఉన్న ఒక్క దేవాలయంలో ఉంది. మన భారతదేశంలో ఈ ఒక్కటే కాడు ఇలా అందరినీ అబ్బుర పరిచే ఎన్నో విషయాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి అనేది సత్యం. అందులోనూ జీవితంలో ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా వినని కనని సంఘటనలు కూడా వుంటాయి. దేవుడు మనుష్యుల ప్రాణాలను ఎప్పుడు ?ఏ విధంగా? తీసుకుంటాడో అతనికి మాత్రమే తెలుసు.

కానీ పోయిన ప్రాణాలను మాత్రం తిరిగి ఇవ్వడు అనే అందరికీ తెలిసిందే. కానీ ఈ ఆలయంలో మాత్రం పోయిన మనిషి ప్రాణాలను కొన్ని నిముషాలపాటు బ్రతికిస్తాడట. ఇది ఎంత వరకు నిజమో, ఎంత వరకు అబద్ధమో అని ఈ విషయం విన్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా మనిషి బతుకుతాడు, ఆ స్థలం యొక్క మహత్యం ఏమిటి? అనే అనేకమైన ప్రశ్నలకు జవాబులను ఇప్పుడ తెలుసుకుందాం..

ఆలయ ఎక్కడ ఉంది...

చనిపోయిన మనిషులను కొన్ని నిమిషాలపాటు బ్రతికించే ఆ అద్భుతమైన ఆలయంలో పరమశివుడు వెలసివున్నాడు. ఈ ఆలయంలో ఉన్న పరమశివుడు ఎంతో శక్తివంతమైన దేవుడుగా చెప్పుకుంటారు అక్కడి స్ధానికులు. అదే లఖ్ మండల మందిర్ ఇది ఒక పురాతనమైన హిందూ దేవాలయం. దురదృష్టం వెంటాడుతున్న ఎంతో మంది భక్తులు ఈ దేవాలయం విశిష్టతలను తెలిసుకుని, ఆలయాన్ని సందర్శించి తమ దురదృష్టాన్ని దూరం చేసుకుంటారు.


ఇంతటి మహిమాన్విత దేవాలయం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో జాన్సర్ బవర్ ప్రదేశంలో వుంది. ఈ దేవాలయాన్ని ఉత్తరాఖాండ్ శైలిలో నిర్మించారని స్థానికులు చెపుతుంటారు. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే చక్రతా నుండి సుమారు 100కిమీ ల దూరం వెల్లాలి. రోడ్డు మార్గం ద్వారానైతే మొదటగా ప్రయాణికులు చక్రతాకి వెళ్లి అక్కడి నుండి సులభంగా లఖ్ మండల్ బస్సు లేదా టాక్సీద్వారా చేరవచ్చును. సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి లఖ్ మండల్ సుమారు 107కిమీ లు దూరాన వుంది. సమీపంలోని విమానాశ్రయం సుజాలి గ్రాంట్ విమానాశ్రయం. ఇక్కడి నుండి లఖ్ మండల్ కి సుమారు 130కిమీ ల దూరం వుంది.

ఆలయ చరిత్ర

మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో కొన్ని రోజులపాటు ఈ ప్రాతంలో కాలంగడిపారని చెప్పుకొంటారు. పాండవులు కాలిడిన పవిత్రమైన స్థలం ఇది అని చెప్పవచ్చును. లఖ్ మండల్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. లఖ్ అంటే "అనేకం", మండల్ అంటే "దేవాలయం" లేదా "లింగం" అనే అర్థాన్ని కలిగివుంది. ఈ దేవాలయం ముఖ్యమైన ఆకర్షణ ఏమంటే అది గ్రానైట్ తో చేయబడిన లింగం. చుట్టుపక్కల ఆ లింగం యొక్క ప్రకాశానికి ఎంతో అందంగా కనపడుతుంది.


చినిపోయిన మనిషి ఎలా బతుకుతాడు..

మహాభారతంలో దుర్యోధనుడు ఒక లక్కగృహంలో భాస్కరుడుని జీవంతోనే కాల్చేయాలని ఒక ఇంటిని నిర్మాణం చేస్తారు. ఆ గృహమే ప్రస్తుత దేవాలయం వుండే ప్రదేశం అని, చుట్టుపక్కన ఉన్న ప్రాంతం అని ప్రజలందరూ నమ్ముతుంటారు. అంతే కాదు ఈ ఆలయంలో దనావ, మానవ ప్రతిమలు వాటితో పాటుగానే దానవ, మానవ అనే కవల ప్రతిమలు ఉన్నాయి. ఈ ప్రతిమలను ఇక్కడికి వచ్చిన భక్తులు పాండవ సహోదరులైన భీముడు, అర్జునుడు అని నమ్మి కొలుస్తారు. మహాభారత్ యుద్ద కాలంలో దుర్యోధనుని నుంచి కాపాడుకోవటానికి పాండవులు ఈ స్థలంలో నివాసమున్నారని భక్తుల నమ్మకం.


అయితే ఈ ఆలయంలో చనిపోయినవారు తిరిగి బ్రతుకటానికి దనావ, మానవ ప్రతిమలు విష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ, విజయులని చరిత్ర చెపుతుంది. అంతే కాదు ఈ ఆలయంలో మహాశివుని పవిత్రమైన అభిషేక జలాన్ని చనిపోయిన వారికి త్రాగిస్తే ఆ మనిసి కొన్ని నిమిషాలకాలం పాటు తిరిగి బతుకుతారని చెపుతుంటారు. ఇదంతా ఆ పరమ శివుని శక్తి అని మ్ముతారు. ఆ పవిత్రమైన జలం మానవులకి జీవం వచ్చేటట్లుచేస్తుంది అంటే ఎవరికి ఆశ్చర్యం కలగదు తప్పదు చెప్పండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories