Top
logo

పెళ్లిలో జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారో తెలుసా..?

పెళ్లిలో జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారో తెలుసా..?
Highlights

ఒకప్పటి కాలంలో పెళ్లిల్లు 5 రోజుల పాటు చేసేవారు. ఊరంతా పచ్చని పందిరి వేసి అంగరంగవైభవంగా పెళ్లిల్లు చేసేవారు.

ఒకప్పటి కాలంలో పెళ్లిల్లు 5 రోజుల పాటు చేసేవారు. ఊరంతా పచ్చని పందిరి వేసి అంగరంగవైభవంగా పెళ్లిల్లు చేసేవారు. వధూవరులిద్దరూ పెల్లిచూపులు చూసుకున్న తరువాత మళ్లీ పెల్లిమంటపంలోనే ఒకరినొకరు చూసుకునే వారు. కానీ ఇప్పుటి తరం వారు పెల్లిచూపులలో చూసుకున్నది మొదలు పెళ్లయ్యేంత వరకు ప్రతీది తాము దగ్గరుండి షాపింగ్ చేస్తున్నారు. అంతే కాదు వధువు దస్తులను వరుడు, వరుని దుస్తులను వధువు ఇద్దరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు.

ఎన్ని సాంప్రదాయాలు మారినా హిందూ వివాహ ఆచారాలు మాత్రం మారలేదు. ఏడు అడుగులు, మూడు ముళ్లు, జీలకర్ర బెల్లం ఈ ఘట్టాలు పెల్లితంతులో ఖచ్చితంగా ఉంటాయి. ఈ జీలకర్ర, బెల్లం పెట్టే ఆచారం కూడా ఎక్కువగా తెలుగు వివాహాలలోనే కనిపిస్తుంది. తెలుగు పెళ్లిల్లలో సుముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టే సమయమే అంటారు. అందు కోసమే ఆ తంతు జరిపే సమయంలో "ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః/ ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్" వంటి మంగళప్రదమైన మంత్రాలను చదువుతారు. జీలకర్ర బెల్లం పెట్టడంతోనే సగం వివాహం జరిగిందని చెపుతారు.

పెళ్లిలో తల మీద జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారు..

పెళ్లి తంతులో పీటలపై కూర్చున్న వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తరువాతే చూసుకుంటారు. అంతకు ముందు పీటల మీద కూర్చున్న వధూవరుల మధ్య ఒక తెరని ఉంచుతారు, ఎప్పుడైనా ఇద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో అప్పుడు ఇద్దరి మధ్య నుంచి తెరను తీస్తారు. జీలకర్ర, బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణం అంటారు. వధూవరులు మొదటిసారి ఒకరినొకరు తాకినప్పుడు వారి స్పర్శ, వారి చూపులు రెండూ పవిత్రంగా, శుభ్రప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టినట్లు కొంత మంది పండితులు చెపుతున్నారు.

అంతే కాదు వధూవరులు నెత్తి మీద జీలకర్ర, బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలనీ మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందని చెబుతారు. అంతే కాదు ఈ జీలకర్ర, బెల్లం రెండింటి కలయికలో ఓ అద్భుతమైన శక్తి విడుదల అవుతుందని చెపుతారు. ఈ పదార్ధాలను వధూవరులు తలమీద పెట్టుకోవడం వలన వారిరువురి మధ్య ఓ విద్యుత్ వలయం ఏర్పడుతుందని చెపుతారు.

బెల్లం లక్షణాలు..

జీలకర్ర, బెల్లం రెండింటికీ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పూ లేకుండా ఉంటుంది. బెల్లం ఎలాంటి అవశేషమూ మిగలకుండా పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి పెళ్లిలో ఈ తంతును పెడతారు. ఒకరిలో ఒకరు కరిగిపోతూనే, ఎవరి అస్తితత్వాన్ని వారు నిలుపుకోవాలనీ తనలోని సద్గుణాలని ఎదుటివారికి అందించాలనీ ఈ రెండు పదార్థాల కలుపుతుంటారు. అంతే కాదు రెండింటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నోరకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒంట్లో ఉన్న వేడిని పొగొట్టి చలవచేయడం దగ్గరి నుంచి రక్తహీనత తగ్గించడం ఇది ఉపయోగపడుతుంది.


Web TitleImportance of jeelakarra bellam in Marriage
Next Story


లైవ్ టీవి