వినాయక చవితి వచ్చేస్తోంది... గణేశుని ఆలయంలో ఏం చేయాలి?

వినాయక చవితి వచ్చేస్తోంది... గణేశుని ఆలయంలో ఏం చేయాలి?
x
Highlights

అసలు వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో చాలామంది భక్తులకు తెలియదు. వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో తెలుసుకుందాం. వినాయకునికి ఆలయానికి వెళ్లేవారు...

అసలు వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో చాలామంది భక్తులకు తెలియదు. వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో తెలుసుకుందాం. వినాయకునికి ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మప్రదక్షిణాలు చేయాలి. కనీసం మూడు గుంజీలు తీయాలి. వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని, కొబ్బరి పువ్వులను కానీ, వెలగ పుష్పాలను కానీ అలంకరణ కోసం సమర్పించాలి.

ఇవి దొరకని పక్షంలో 21 గరిక గుచ్ఛాలను సమర్పించాలి. నైవేధ్యంగా చెరకు, వెలగకాయ, కొబ్బరిబోండాలను సమర్పించుకోవాలి. గణేశుని ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణాలు చేయాలి. గణేశునకు అభిషేకం అంటే ఎంతో ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరినీళ్ళు, చెరకురసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు ఉంటాయి.

జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో గణేశుని పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తెల్లజిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడికి అర్చించినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరిన కోరికలు నెరవేరుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories