ఇంటి స్థలం కొంటున్నారా... ఈ జాగ్రత్తలు తెలుసుకొండి!!

ఇంటి స్థలం కొంటున్నారా... ఈ జాగ్రత్తలు తెలుసుకొండి!!
x
Highlights

1. స్థలానికి సంబంధించిన నాలుగు భుజాల్లో హెచ్చు తగ్గులున్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. ఇలాంటి...

1. స్థలానికి సంబంధించిన నాలుగు భుజాల్లో హెచ్చు తగ్గులున్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే అశుభాలు కలుగు తాయని వాస్తు చెబుతోంది.

2. పొడవు ఎక్కువగా ఉండి, భుజాల్లో హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం కూడా మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశు హాని, అనారోగ్యం కలిగిస్తుంది.

3. చేట ఆకారంలో గల స్థలం కూడా ఇంటి నిర్మాణానికి మంచిది కాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే... ఎంత సంపాదించి నా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తుంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం కూడా జరుగుతుందని వాస్తు శాస్తజ్ఞ్రులు అంటున్నారు.

4. ఢమరకపు ఆకారంలో ఉండే స్థలం కూడా మంచిది కాదు. ఇలాంటి నేలలో ఇంటి నిర్మా ణం చేపడితే సంతానం కలగటంలో సమస్య లు, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.

5. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తుంది.

6. కుంభాకార స్థలంలో కట్టే ఇంటి వల్ల... భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపిం చటం జరుగు తుంది.

7. విసన కర్ర ఆకా ర స్థలం.. ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.

8. మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను సృష్టిస్తాయి. విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.

9. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

'L' ఆకారంలో ఉండే స్థలంలో ఇంటి నిర్మాణం అశుభం...

చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఇంటిని, అపార్ట్‌మెంట్‌ లను నిర్మించాలని వాస్తుశాస్త్రాలు చెబుతున్నాయి. అలా నిర్మించని గృహాలపై విషవాయువుల ప్రభావం ఉంటుం దని పలువురు శాస్తజ్ఞ్రుల విశ్వాసం కూడా. ఇల్లు, ఆపార్ట్‌ మెంట్‌, ఆఫీస్‌ ఇలా ఏదైనా ఒకవిధమైన షేప్‌పై ఆధారపడి నిర్మించటం జరుగుతుంది. అలాకాకుండా నిర్మాణానికి పరిమితం లేని పక్షంలో సీత గీత దాటినట్టు, హద్దుదాటి ప్రత్యేకంగా ఏ గదైనా దాటి నిర్మించటం మంచిది కాదు.అందు చేత గృహాలు నిర్మించేటపుడు జాగ్రత్తతో, వాస్తు ప్రకారం షేప్‌ను పాటించి నిర్మించాలి. ప్రస్తుతం మీ ఇల్లు 'ఎల్‌' ఆకారంలో ఉంటే ఇంటిలోని గదులు అలాగే నిర్మించటం అంత మంచిది కాదు. రెండు 'ఎల్‌' షేప్‌లు కలవ కూడదు. రెండు 'ఎల్‌' షేప్‌లు కలిసి దీర్ఘ చతురస్రాకారం ఏర్పడుతుంది. అయితే 'ఎల్‌' షేప్‌ ను వాస్తుశాస్త్రంలో అసంపూర్ణ చిహ్నంగా శాస్తజ్ఞ్రులు స్పష్టం చేస్తున్నారు. 'ఎల్‌' ఆకారంలో ఇంటి నిర్మాణం చేపడితే... గృహాలకు సహాయాన్ని అందించే ప్రకృతి సిద్ధమైన శక్తులను దూరం చేసుకునే పరిస్థితి కలుగుతుందని వారి అభిప్రాయం. ఇప్పటికే తమ ఇళ్లలో 'ఎల్‌' ఆకారముంటే ఆ ఆకారాన్ని మార్చే విధంగా దీర్ఘ చతుర్రసం వచ్చేలా స్థలానికి ఒకమూల మొక్కను నాటడం గాని, లేదా ఏదైనా పోల్‌ను పాతటం కానీ మంచిది. ఇలా చేస్తే కొంతైనా దుష్ప్రయోజనాలకు దూరంగా ఉంచటానికి సాధ్యపడు తుంది. కాబట్టి ఇంటి నిర్మాణం చతురస్ర లేదా దీర్ఘచతుర స్రాకారాన్ని మాత్రమే కలిగి ఉండాలి. అలా లేని పక్షంలో విద్యా విషయంలో సమస్యలు ఏర్పడటం, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, భార్యాభర్తల మధ్య స్పర్థలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories