Top
logo

Lord Brahma temple Pushkar : భారత దేశంలో బ్రహ్మదేవుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా

Lord Brahma temple Pushkar : భారత దేశంలో బ్రహ్మదేవుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా
X
Highlights

Lord Brahma temple Pushkar : భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్. అది...

Lord Brahma temple Pushkar : భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్. అది అజ్మీరు జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో ఇది ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి.

వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ధ్వంసం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాతి కాలంలో ధ్వంసం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి. బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ఒకటి, ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని ప్రంబనన్ ఒకటి.

క్షేత్రపురాణం

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి ఒక ఆలయం ఉంది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. భారతదేశంలో ఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతే తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు పద్మ పురాణంలో చెప్పబడిన కథను అనుసరించి పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రహ్మ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుధంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట.

ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మధ్య పుష్కర్, చివరిది కనిష్ఠ పుష్కర్. బ్రహ్మ చేతి (కర) లోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు వచ్చింది. బ్రహ్మ లోకకళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి దేవతల నందరిని ఆహ్యానించాడు. ముహూర్తకాలం ఆసన్నమైనది. ఆహూతులందరు విచ్చేసారు. సావిత్రిని (ఈమెనే సరస్వతి అని కూడా పిలుస్తారు) పిలుచుకొని రమ్మని తన కుమారుడైన నారదుని పంపాడు బ్రహ్మ. నారదుడు వెళ్లే సరికి ఆమె సిద్దంగానే నారదుడు " నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు? మీస్నేహితులను తీసుకరా " అని సలహా ఇచ్చాడు. అందువలన సావిత్రి తనసహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. యజ్ఞవాటికయందు అందరు రుషులు, దేవతలు సిద్దంగా ఉన్నారు.

ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంబించాలనే తలంపుతో బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెప్పి ఇంద్రుడు తీసుకు వచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంబిస్తానని చెప్తాడు. దాంతో ఇంద్రుడు సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయి తీసుకొని వచ్చాడు. శివుడు, విష్ణువు సలహామేరకు ఆ అమ్మాయిని గోవులోనికి పంపి శుద్ధిచేసారు. అలాచేస్తే పునర్జన్మ ఎత్తినట్లని ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి సర్వాలంకారశోభితు రాలిని చేస్తారు, గోవుతో శుద్ధి చేయబడినది గాన ఆమెకు గాయిత్రి అని నామ కరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంబిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయాన సావిత్రి అక్కడికి వచ్చి, బ్రహ్మప్రక్కన మరొక స్త్రీ కూర్చొని వుండగా చూసి ఆగ్రహించి బ్రహ్మ దేవునితో సహా అక్కడున్న వారినందరిని శపిస్తుంది. భర్తను వృద్దుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు వుండవని శపిస్తుంది. అన్ని యుద్ధాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతొ బాధపడతాడని విష్ణువును, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుడిని శపిస్తుంది.

తర్వాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం ఉంది. అక్కడే చిన్న సెలఏరు కూడా ఉంది. దీన్నే సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలో స్నానం చేస్తే నిత్య సుమంగళిగా వుంటారని భక్తుల నమ్మకం. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాపవిముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్దించిన శక్తులతో గాయిత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందతారని శాపతీవ్రతను తగ్గిచింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయము దాని లాగ వుండవు. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాని కట్టించాడని అంటారు. ప్రపంచంలోకెల్ల పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు. పౌరాణికంగా ప్రశస్తిగాంచిన పంచ సరోవరాల్లో దీని ప్రస్థానం ఉంది.

చరిత్ర

పుష్కర్ అతి పురాతన నగరము. దీని నిర్మాణము జరిగిన సమయలు లెక్కకట్ట్డానికి వీలుకానిది. బ్రహ్మదేవుడు ఈ నగర నిర్మాణనికి కారణమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు రాధా కృష్ణులను ప్రత్యక్షం చేసుకోవడానికి 60,000 సంవత్సరాలు యజ్ఞం చేసాడని పురాణాల కథనాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు యజ్ఞము చేయ తలపెట్టి తగిన ప్రదేశము వెదుకుతున్న సమయంలో ఈ ప్రదేశము యజ్ఞానికి అనువైనదిదిగా భావించబడినదని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడున్న దేవాలయం 14వ శతాబ్దంలో కట్టిందని, కాని దానికి పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితంమే అక్కడ ఆలయం వుండేదని అంటారు.

తర్వాత ఆదిశంకరాచార్యుడు ఒకసారి, మహారాజ జనత్ రాజు మరోసారి ఆలయాన్ని పునరుద్దరించారని చరిత్రకారుల నమ్మకం. ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి ఉన్నాయి. భక్తులు తమపేరు చెక్కిన వెండి నాణేలను దేవునికి సమర్పిస్తుంటారు. పాలరాతి మెట్లు ఎక్కి మండపం దాటి గర్బగుడిలోకి వెళ్లగానే హంసవాహనం మీద వున్న చతుర్ముఖ బ్రహ్మవిగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరుసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఆలయ గోడల మీద సరస్వతిదేవి, ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలో పూజాదికాలు సనాతనధర్మం ప్రకారమే జరుగు తుంటాయి. గర్బగుడి లోని విగ్రహాన్ని గృహస్థులైన పురుషులు పూజించ రాదు. కేవలం సన్యసించిన వారే పూజించాలి. ఆ సాధువులు కూడా పుష్కర్ లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి వుండాలనేది నిబంధన.

గర్బగుడికి ఎదురుగా వున్న మండపంలో వెండితాబేలు ఉంది. ప్రతిఏటా కార్తీక పౌర్ణమితో బాటు ప్రతిపౌర్ణమి, అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలోనే పుష్కర్ జాతర కూడా జరుగుతుంది. ఇది దీపావళి తరువాత వచ్చే ఏకాదశి నాడు మొదలై పౌర్ణమి వరకు జరుగుతుంది. జాతర సమయంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతర హస్తకళలకు పెట్టింది పేరు. ఆలయానికి ఎదురుగా వున్న రెండు కొండలపై వున్న సావిత్రి, గాయత్రి దేవతలను కూడా భక్తులు దర్శించుకుంటారు . సావిత్రి ముఖ కవళికలు కోపంగాను, గాయిత్రి విగ్రహం భయపడు తున్నట్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఇంకా అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనది అగస్తేశ్వర ఆలయం ఉంది.

అందులోని శివలింగం బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడిందని, ఇక్కడ పూజలు చేసి, అభిషేకం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పెద్దదైన ఈ శివలింగం పై రాగితో చేసిన పాము చుట్టు కొని వున్నట్టుటుంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత మరో ఆలయం పేరు రంగ్‌జీ ఆలయం ఉంది. ఇక్కడి విష్ణుమూర్తిని రంగ్‌జీ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణభారతదేశ శైలిలో వుంటుంది. మరో ముఖ్య మైన ఆలయం వరాహ దేవాలయం. ఇక్కడ విష్ణుమూర్తి వరాహరూపంలో దర్శనమిస్తాడు. ఇంకా ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలున్నాయి.

Web TitleHistory of Lord Brahma temple Pushkar Rajasthan
Next Story