దేవాలయాల్లో చేయకూడని పనులు ఏవంటే

దేవాలయాల్లో  చేయకూడని పనులు ఏవంటే
x
Highlights

భారత దేశం అంటేనే హిందూ దేవాలయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఎండ్ల చరిత్ర కలిగిన, ప్రసిద్ది చెందిన ఆలయాలను భారత దేశంలో చూడొచ్చు. కేవలం హిందూ మతంలో మాత్రమే...

భారత దేశం అంటేనే హిందూ దేవాలయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఎండ్ల చరిత్ర కలిగిన, ప్రసిద్ది చెందిన ఆలయాలను భారత దేశంలో చూడొచ్చు. కేవలం హిందూ మతంలో మాత్రమే కాదు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం భక్తజనుల సౌకర్యార్థం భగవంతుడు అర్చారూపియై భూలోకానికి వచ్చాడు. ప్రతి దేవాలయంలోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానాలలో ఆవాహన చేయబడిఉంటారు. చారిత్రకంగా దేవాలయాలు చాలా ప్రాధాన్యత కలిగివున్న ప్రదేశాలు. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. ఈ దేవాలయాలు హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, చరిత్రకారులు ఆలయాల గురించి చరిత్ర రాసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ దేవాలయాలు ఎన్నిరకాలుగా ఉంటాయి. దేవాలయ నిర్మాణం ఎలా ఉంటుంది తెలుసుకుందాం.

ఆలయాలు అయిదు విధాలుగా ఉంటాయి..

స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా అవతరించినవి.

దివ్య స్థలాలు - దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి.

సిద్ధ స్థలాలు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి.

పౌరాణ స్థలాలు - పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.

మానుష స్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడినవి.

దేవాలయ నిర్మాణం..

దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన విభాగాలుంటాయి.

దేవాలయ నియమావళి..

ఆగమ శాస్త్రంలో దేవాలయాలలో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.

ఆలయం లోపల వాహనం మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.

ఆలయానికి ప్రదక్షిణము చేసి, తరువాత లోనికి ప్రవేశించాలి.

ఆలయంలోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధం పట్టుకొనిగాని ప్రవేశించరాదు.

ఆలయంలోకి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తింటూ గాను ప్రవేశించరాదు.

ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన చేయరాదు.

ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చోడం, నిద్రపోవుటం చేయరాదు.

ఆలయంలో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.

ఆలయంలో ఎన్నడూ వివాదాలు పెట్టుకోరాదు.

ఆలయంలో అహంకారంతో, గర్వంతో, అధికార దర్పంతో ఉండరాదు.

ఆలయంలో దేవుని ఎదుట పరస్తుతిని, పర నిందను కూడా చేయరాదు.

ఆలయంలో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.

అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.

ఒక చేతితో ప్రణామం చేయరాదు.

ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.

Show Full Article
Print Article
Next Story
More Stories