logo
ఆధ్యాత్మికం

బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం ఎక్కడుందో తెలుసా

బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం ఎక్కడుందో తెలుసా
X
Highlights

భారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఆ ఆయలం బ్రహ్మచే...

భారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఆ ఆయలం బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం కలిగిన ఆలయం. అందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది.

ఆలయం విశేషాలు..

బ్రహ్మలింగేశ్వర ఆలయం విశాఖ జిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో శివాలయం. ఇది 16వ శతాబ్దంలో చోళులు నిర్మించినది. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరహానది ఉత్తరంగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది.

స్థల పురాణం

లోక కళ్యాణార్ధం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని భువికి రప్పించారు. కృతయుగంలో జరిగిన ఈసంఘటనతో ఈ ప్రాంతానికి చరిత్రలో స్థానం లభించింది. అందుకే ఈప్రాంత బలిఘట్టంగా పేరుగాంచింది. తదుపరి హిందూ మహారాజు శివునికి నిత్యం పూజలు చేసేవాడని, ఒక సందర్భంలో శివార్చనకు నీరు లేకపోవడంతో విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా వరాహావతారంలో దర్శనం ఇచ్చిన ఆయన నీటిని సమకూర్చడంతో ఈ ప్రాంతంలో ప్రవహించే నదికి వరాహానది అని పేరువచ్చింది. ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈశివలింగానికి ప్రతీ ఏటా మహాశివరాత్రి పర్వదినాన్న పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతాయి.

బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇక్కడ శివలింగం స్థాపించినట్లు దీంతో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్లు కథనం. ఆలయానికి సమీపంలో వరహానది ఉత్తర వాహినిగా పేరుపొంది విష్ణుదేవుని ప్రసాదంగా వినుతి కెక్కింది. హిరాణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహారూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహా రూపంలో ఉన్న విష్ణు ఈ మార్గం గుండా నదిని ఏర్పరడటంతో వరహానదిగా పేరుగాంచినట్లు చెబుతున్నారు.

ఇతర విశేషాలు

త్రిశూల పర్వతంపై ఇక్కడి ఆలయం ఉంది. సమీపంలో విభూతి గనులు కూడా ఉన్నాయి. ఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిసేకాలు చేయించుకుంటారు. అలాగే ప్రతీ ఏటా కార్తీమాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్న పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుపుతుంటారు. ఆయా పర్వదినాల్లో లక్షలాదిమంది ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. జిల్లాలోని ఇతర దూర ప్రాంతాల నుండి సైతం లక్షలాదిమంది భక్తులు బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు, పై కప్పులు సైతం రాతితోనే నిర్మించారు. ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోనే కొనసాగుతుంది. దేవాలయానికి గల ఆస్తులతోనే నిత్య ధూప, దీప, నైవేధ్యాలను సమకూర్చుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. బ్రహ్మలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

ఆలయ నిర్మాణ శైలి

బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు , పై కప్పులు సైతం రాతితోనే నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు. ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది.

పర్వదినాలు

మహాశివరాత్రి మూడు రోజుల పాటు ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు కూడానిర్వహిస్తారు.

Web TitleHistory and Importance of Magnifice of Brahmalingeswara Swamy Temple in Andhrapradesh
Next Story