శుభోదయం

శుభోదయం
x
Highlights

శుభ తిథి శ్రీ వికారి నామ సంవత్సరం - ఉత్తరాయణం 22.05.2019 - బుధవారం సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6.22 వసంత రుతువు; వైశాఖ మాసం; బహుళ పక్షం ...

శుభ తిథి


శ్రీ వికారి నామ సంవత్సరం - ఉత్తరాయణం

22.05.2019 - బుధవారం

సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6.22

వసంత రుతువు; వైశాఖ మాసం; బహుళ పక్షం

చవితి: రా. 2.38 తదుపరి పంచమి

పూర్వాషాఢ నక్షత్రం: తె. 5.25 తదుపరి ఉత్తరాషాఢ

అమృత ఘడియలు: రా. 12.20 నుంచి 2.02 వరకు

వర్జ్యం: మ. 2.14 నుంచి 3.54 వరకు

దుర్ముహూర్తం: మ. 11.30 నుంచి 12.22 వరకు

రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు


సంఘటనలు

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం : అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ను మే 22 న జరుపుకుంటారు.భూమిపై జీవాల మధ్య భేదాన్నే 'జీవవైవిధ్యం' అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి.

ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్: 2004 భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనారు. (14వ లోక్ సభ)

నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్పు: 2008 నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది

జననాలు

విలియం స్టర్జియన్: 1783 మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.

పరవస్తు వెంకట రంగాచార్యులు: 1822 సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)

ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె: 1828 ఆధునిక నేత్ర వైద్యమును అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు.

సర్ ఆర్థర్ కానన్ డోయల్: 1859 షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త.

రాంరెడ్డి వెంకటరెడ్డి: 1944 ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)

మరణాలు

విక్టర్ హ్యూగో: 1885 ఫ్రెంచ్ రచయిత. (జ.1802)

మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి: 1960 సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)

వేటూరి సుందరరామ్మూర్తి: 2010 సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)

పర్సా సత్యనారాయణ: 2015 కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)

Show Full Article
Print Article
Next Story
More Stories