Top
logo

Good Friday 2021: సిలువే కొలమానం..గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత గురించి తెలుసా?

Good Friday Wishes to the Devotees of Christ
X

Good ఫ్రైడే:(ఫైల్ ఇమేజ్)

Highlights

Good Friday 2021: యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు.

Good Friday: ఏసుకు శిలువలో వేసిన రోజునే బ్లాక్ ఫ్రై డే అంటారు. ఈ దినాన్ని గుడ్ ఫ్రై డే, గ్రేట్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే అని పిలుస్తుంటారు. రెండు వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం ఏడీ 33 గా అంచనా వెయ్యబడింది. వాస్తవానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి చర్చిలో దేవున్ని తలచుకుంటారు. ప్రార్థనలో గడుపుతారు.

గుడ్ ఫ్రైడే అనే ఈ పేరు ఎలా వచ్చిందో అనేదానికి పలువురు పలు రకాలుగా వారి వాదనలు వినిపిస్తున్నారు. శుభ శుక్రవారంలో ఏదో మంచి ఉందని చాలా మంది భావిస్తారు. యేసు ప్రభువు సమస్త మానవాళి చేసిన పాపాలకు తన ప్రాణాలు అర్పించి పునరుత్తానం చెందాడని చెబుతారు. మరికొందరు గుడ్ అనే పదం ఇంగ్లీషులో ఏమైతే అర్థం ఇస్తుందో దాని ప్రకారంగానే హోలీ ఫ్రైడే అని పిలుస్తారని చెప్తారు. లెంట్ కాలంలోనే గుడ్ ఫ్రైడే వస్తుంది. ఈ సమయంలో క్రైస్తవులు(చర్చి) మాంసాహారం తీసుకోరు. గుడ్ ఫ్రైడే రోజున ఒక సారి పూర్తి స్థాయి భోజనం మరో రెండు పూట్ల ఫలహారం తీసుకుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒకొక్కరూ ఒక్కొక్క పద్దతిని పాటిస్తారు. కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది గుడ్‌ఫ్రైడే. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్(చర్చి) కూడా జీసస్ పుట్టుక గురించి ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రభువును శిలువ వేయడాన్ని గురించి ప్రస్తావించింది. యూదా ఇస్కరియోత్ అనే యేసు ప్రభువు శిష్యుడు కేవలం 33 వెండి నాణేల కోసం యేసు ప్రభువుకు నమ్మక ద్రోహం చేస్తాడు. క్రీస్తు ఎక్కడున్నాడో సైన్యానికి చెప్పేస్తాడు. ఆ తర్వాత క్రీస్తును తీసుకురావడం ఆయన్ను సిలువ వేయడం సిలువపై వ్రేలాడి ఉండగా ప్రభువు చివరిగా మాట్లాడే ఏడు మాటలను క్రైస్తవులు ఈ రోజు గుర్తు తెచ్చుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

మరణానికి ముందు క్రీస్తు చెప్పిన ఆఖరి మాటలు

*తన తండ్రి అయిన యెహోవాతో - ''వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీళ్ళను క్షమించు.''

*తన తల్లితో- (యోహానును చూపించి) ''ఇదిగో నీ కుమారుడు''... యోహానుతో- (తల్లి మరియాను చూపిస్తూ) ''ఇదిగో! నీ తల్లి!''

*శిలువలో తన పక్కన ఉన్న నేరస్తుడితో - ''ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరలోకంలో ఉంటావు.''

*తండ్రి అయిన యెహోవాతో - (ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?) ''దేవా! నా దేవా! నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?''

*చివరి క్షణాలు దగ్గరవుతున్నప్పుడు - ''నాకు దాహంగా ఉంది.''

*చివరి ఘడియల్లో - ''ఇక సమాప్తమైపోయింది.''

*ఆఖరి మాటగా - ''తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.''

Web TitleGood Friday Wishes to the Devotees of Christ
Next Story