శ్రీనివాసుడి ఆవాసం.. .హైందవ సంస్కృతికి ఆలవాలం

శ్రీనివాసుడి ఆవాసం.. .హైందవ సంస్కృతికి ఆలవాలం
x
Highlights

ప్రకృతి సంపద సౌందర్యాల మధ్య జనఘోషతో నిండిన వనారణ్యం తిరుమల. శిలాతోరణాల స్వాగతంతో ప్రణమిల్లే పర్వత శ్రేణుల మధ్య కొలువుదీరిన పుణ్యధామం ఏడుకొండలు....

ప్రకృతి సంపద సౌందర్యాల మధ్య జనఘోషతో నిండిన వనారణ్యం తిరుమల. శిలాతోరణాల స్వాగతంతో ప్రణమిల్లే పర్వత శ్రేణుల మధ్య కొలువుదీరిన పుణ్యధామం ఏడుకొండలు. సహజసిద్ధమైన జీవజాలాలతో అలరారే శ్రీనివాసుని ఆవాసమే సప్తగిరులు. అశేష జనావళికి ముక్తిని ప్రసాదించే దివ్య ప్రాంగణం తిరుమలధామం. తూర్పు కనుమల మధ్య ప్రకృతి అందాల మధ్య నెలకొన్న క్షేత్రం తిరుమల. కొండల్లో కొలువైన దేవదేవునికి కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలూ, పునస్కారాలు జరుగుతూనే ఉన్నాయి.

నిత్యకల్యాణం పచ్చతోరణంలా విలసిల్లుతున్న ఏడుకొండలవాడికి లెక్కలేనన్నీ అభిషేకాలు. అందుకే తిరుమల అంటే పులకింత. తిరుమల పేరుచెబితేనే తుళ్లింత. ఈ ఆధ్యాత్మిక కేంద్రంపై అంతులేని నమ్మకం. సప్తగిరీశుడి సన్నిధిలో సేదతీరాలన్న ఉత్సాహం. అక్కడ జరిగే ప్రతీ ఉత్సవం...ఒక వేడుకే. ప్రతి వేడుక ఒక ఉత్సవమే. పరమ పావనమైన ఈ పుణ్య క్షేత్రంలో అడుగు పెట్టాలంటే వంద జన్మల్లో చేసుకున్న పుణ్యం వెంట రావాలి. అక్కడ అడుగు పెట్టిన తరువాత మనకి తెలియకుండానే వేయి జన్మల పుణ్య ఫలం దక్కుతుంది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించాలనీ, స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని మనసారా చూసి తరించడం... ఆ మహిమ గురించి చెప్పుకోవడం.. చెప్పుకొని తన్మయత్వం చెందడం అన్నీ ఎన్నో జన్మల పుణ్యఫలం. శేషాచలం, గరుడాచలం, వేంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనా చలం కొండలపై వెలసిన శ్రీవారు ఏడుకొండల వాడిగా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. శేషాచల శిఖరాల్లో వెలసిన తిరుమల అసమాన దివ్య క్షేత్రం. హైందవ సంస్కృతికి ఆలవాలం. కోట్లాది భక్తులకు ముక్తి, శక్తి, స్ఫూర్తిధామం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories