Top
logo

శ్రీమహావిష్ణువు తన రెండో అవతారంగా తాబేలునే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

శ్రీమహావిష్ణువు తన రెండో అవతారంగా తాబేలునే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
Highlights

హిందూ ధర్మ పురాణాలలో శ్రీమహావిష్ణువు దశావతారాలతో దర్శనం ఇస్తారు. ఈ దశావతారాలలో రెండో అవతారమే కూర్మావతారం ఇది కృతయుగంలో ఈ అవతారం సంభవించింది. కూర్మము అనగా తాబేలు.

హిందూ ధర్మ పురాణాలలో శ్రీమహావిష్ణువు దశావతారాలతో దర్శనం ఇస్తారు. ఈ దశావతారాలలో రెండో అవతారమే కూర్మావతారం ఇది కృతయుగంలో ఈ అవతారం సంభవించింది. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగిస్తారు. దాన్ని పాలసముద్రంలో వేసి సముద్రాన్ని మధించే సమయంలో పర్వతం బరువుకి పాలసముద్రంలో మునిగిపోబోతుంది. దాన్ని గమనించిన శ్రీ మహావిష్ణువు కూర్మావతారములో ఆ పర్వతం కిందికి చేరి దాన్ని భరిస్తాడు.

అవతార గాథ..

ఒకసారి దేవేంద్రుని ప్రవర్తనకు దూర్వాస మహర్షి కోపాదృక్తుడై "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. దాంతో రాక్షసుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. పరాజయాన్ని భరించలేని దేవతాగణం తమకు దారి చూపించమని విష్ణువుతో మొరపెట్టుకున్నారు. దాంతో శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతారు "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని ఉపాయాన్ని ఉపదేశించాడు. ఈ అమృతం సముద్రగర్భంలో ఉందని దాన్ని మధించి బయటికి తీసుకురావాలని చెబుతాడు.

ఇక దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా చేసుకుని క్షీరసముద్ర మథనాన్ని మొదలుపెడతారు. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండ కిందికి చేరి దాన్ని భరించాడు.

అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనం చేయగల హాలాహలం ఉద్భవించింది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని తాగి, తన కంఠంలోనే దాచుకున్నాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా అవతారం ఎత్తి ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.

శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్నే ఎందుకు ఎంచుకున్నాడు..

విశ్వంలోని జీవజాతుల్లో అతి పురాతనమైన జీవజాతిలో తాబేలు ఒకటి. అవసరమైనపుడు మాత్రమే అవయవాలను బహిర్గతంచేసే ఈ జీవులు ప్రశాంతంగా సంఘజీవనాన్ని సాగిస్తాయి. జీవరాసుల్లో శ్వాసక్రియ అతి తక్కువగా ఉండే జీవజాతుల్లో తాబేలు ఒకటి. ఇవినిమిషానికి 5సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటాయి. అందువల్లే తాబేల్లు 500 సంవత్సరాల దాకా జీవిస్తాయి. వీటి మెదడు శరీరం బరవులో ఒక శాతం మాత్రమే ఉన్నప్పటికీ గ్రహణ శక్తి ఎక్కువ. మానవ జాతి కూడా ప్రశాంత సంఘజీవనం సాగించాలని అన్నింటా స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిచాలనే సందేశం ఇవ్వడానికే స్వామివారు కూర్మనాధుడిగా అవతరించారు.

ఇక కూర్మావతారం గురించి పోతన తన భాగవతంలో ఈ విధంగా వర్ణించాడు వర్ణించాడు...

సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున

నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు

సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు

విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు

వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ

మంబుజంబుల బోలెడి యక్షియుగము

సుందరంబుగ విష్ణుండు సురలతోడి

కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె.


Web TitleDo you know why Lord Mahavishnu chose the turtle as his second incarnation
Next Story


లైవ్ టీవి