Vastu Tips: కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు లేదా కొన్నప్పుడు ఈ విషయాలు మరచిపోవద్దు..!

Do Not Forget These Things While Building Or Buying A New House According To Vastu
x

Vastu Tips: కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు లేదా కొన్నప్పుడు ఈ విషయాలు మరచిపోవద్దు..!

Highlights

Vastu Tips: సనాతన హిందూ సంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి చాలామంది వాస్తు ప్రకారం ఏ పనైనా చేస్తున్నారు. ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక దిశ ఉంటుంది.

Vastu Tips: సనాతన హిందూ సంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి చాలామంది వాస్తు ప్రకారం ఏ పనైనా చేస్తున్నారు. ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక దిశ ఉంటుంది. అది అక్కడ ఉంచితేనే మంచిది లేదంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొత్త ఇల్లు నిర్మించినా, కొనుగోలు చేసినా కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే మీరు చేసిన పని వృథా అవుతుంది. అలాంటి కొన్ని విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కొత్త ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు మీ ఇంటిని వాస్తు శాస్త్ర నియమాలు, సూత్రాల ప్రకారం రూపొందించడం ముఖ్యం. వాస్తు శాస్త్రంలో ఇంటి దిశ, రంగు, డిజైన్, పరిమాణం అన్నీ ముఖ్యమైనవే. వీటిని దృష్టిలో ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇల్లు నిర్మించేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు ప్రతి వ్యక్తి వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను అనుసరించడం చాలా అవసరం.

వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండాలి. వంటగదిని ఎప్పుడూ నైరుతి, ఈశాన్యం లేదా ఉత్తరం వైపు నిర్మించకూడదు. ఇంటి ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. దీని ద్వారా నెగెటివ్ లేదా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ప్రవేశ ద్వారం దిశ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. పడకగదికి దిక్కు సరిగ్గా లేకుంటే వైవాహిక జీవితంలో ఎప్పుడూ టెన్షన్, గొడవలు జరుగుతాయి. వాస్తు ప్రకారం పడకగది నైరుతి దిశలో ఉండాలి. ఇంట్లో బాత్రూమ్ సరిగ్గా లేకుంటే నెగిటివ్‌ శక్తి పెరుగుతుంది. వాస్తు ప్రకారం బాత్రూమ్ వాయువ్య మూలలో నిర్మించాలి. బాత్రూమ్ ఉత్తరం వైపు ఉండాలి. లివింగ్ రూమ్ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. వాస్తు ప్రకారం గదిని మొక్కలతో అలంకరించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories