భగవంతుడు గొప్పా... భక్తి గొప్పదా!!

భగవంతుడు గొప్పా... భక్తి గొప్పదా!!
x
Highlights

భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయలేని సంబంధం. విడదీయరాని అనుబంధం. ఒకరుంటేనే మరొకరు. ఓ తత్త్వముంటేనే రెండోది సత్యమయ్యేది. నిత్యమయ్యేది. సాఫల్యమయ్యేది....

భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయలేని సంబంధం. విడదీయరాని అనుబంధం. ఒకరుంటేనే మరొకరు. ఓ తత్త్వముంటేనే రెండోది సత్యమయ్యేది. నిత్యమయ్యేది. సాఫల్యమయ్యేది. భగవంతుడు లేనిదే భక్తుడుండడు. భక్తి ఉండదు. భక్తుడికి అస్తిత్వం ఉండదు. భక్తుడు లేకపోతే భగవంతునికి ఓ సాకారం ఉండదు. ఆకారం ఉండదు. భక్తుడుంటేనే భగవంతుడికి అస్తిత్వం ఉండేది. భగవంతుడుంటేనే భక్తుడికి పూర్ణత వచ్చేది. పరిపూర్ణత లభించేది. భగవంతుడు భక్తుడు ఇద్దరూ- ఒకరికి మరొకరు తోడుగా, నీడగా, జోడుగా, జోడీగా ఉంటేనే భక్తి ఉండేది. భక్తికో రూపం ఉండేది. స్వరూపం ఉండేది. సారూప్యం ఉండేది. సాయుజ్యం ఉండేది. అయితే భగవంతుడు, భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరి అధీనంలో ఎవడుంటారు? ఎవరి ఆధిపత్యంలో ఎవరుండేది? ఈ ప్రశ్నలు సహజంగా కలగకమానవు.

శక్తివంతమైన భక్తికోసం తపించాలి, తపనపడాలి. వేధించాలి. వేదనపడాలి. రోదించాలి. సాధన చేయాలి. శోధన చేయాలి. అలాంటి భక్తితత్త్వాన్ని సంపాదించాలి. స్వంతం చేసుకోవాలి. సాఫల్యం చేసుకోవాలి. అసలు సిసలైన భక్తితత్త్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అనుభవించాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలి.

ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి. పునీతులం కావాలి. భక్తి అలవడితే హెచ్చుతగ్గులు, తారతమ్యాలు ఇవేవీ కనబడవు. అంతా పరమాత్మ స్వరూపంగా భాసిస్తుంది. ప్రతివారు భగవంతుని స్వరూపులుగా కనిపిస్తారు. అంతా భగవంతుడే కనిపిస్తే హెచ్చుతగ్గులేముంటాయ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories