Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమవుతుంది.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today2nd June
X

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ, వ్యాపార విషయంలో అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాట్లాడేటపుడు ఆచూతూచి మాట్లాడాల్సి వుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృషభరాశి: ఈ రాశి ఈ రోజు మీ మనో థైర్యంతో, ఆత్మబలంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో అవకాశాలు సన్నగిల్లి నిరుత్సాహం కలుగుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి, కుటుంబంతో కొంత సమయాన్ని గడపండి. పనిలో మీ సామర్థ్యం పెరుగుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంతా మీరనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చుకునే కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు తేలికగా పురోగతి సాధిస్తారు..

సింహ రాశి: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమవుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారస్థులు పురోగతి సాధిస్తారు.

కన్యా రాశి: ఈ రాశి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సత్ఫలితాన్నిస్తుంది. కొందరు స్నేహితులతో చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీ అబ్బాయి నుంచి మంచి కబురు వస్తుంది.

తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు ఉద్యోగంలో పై అధికారులు ఎంతగానో ప్రోత్సహిస్తారు. అప్పో సొప్పో చేసి ఇల్లు కొనుక్కోవాలని గట్టి నిర్ణయానికి వస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు వృత్తి, వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది దేవుడు మీ వైపే ఉన్నాడని మీకు అర్థమవుతుంది. డబ్బు కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వీసా మంజూరు అవుతుంది. గతంలో మీరు కొన్న స్థలం రేటు పెరుగుతుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు మీ వర్క్ ఫ్రమ్ మామ్ బాగానే సాగిపోతుంది. కొద్దిగా నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. జేబు నిండుగా ఉంటుంది. వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు యుగళ గీతంలోకి దిగుతాయి.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. మైండ్ ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టమైన పనిపై శ్రద్ధపెట్టడం అవసరం. ప్రతి పనీ ఎంతో ఆలోచనతో చాలా జాగ్రత్తతో చేయాల్సి వుంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఉద్యోగంలో మార్పు ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. మీ ఇంట్లో ఓ శుభవార్త మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారు పట్టుదలతో వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సి వుంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో అభివృద్ది సాధిస్తారు. ఎవరికైనా హామీ ఇచ్చే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 2nd June
Next Story