Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు చేసే పనిపై ఏకాగ్రత ఎంతో అవసరం

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 9th April
X

Todays Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| శుక్రవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: ఈ రాశివారు స్వీయ తప్పిదం వల్ల ఇబ్బందులకు గురవుతారు. పిల్లల చదువుకు సంబంధించి కొంత ఆందోళన చెంుతారు. కార్యాలయంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహచరులు సహకరిస్తారు. చిన్న పిల్లలతో మంచి సమయం గడుపుతారు. మధ్యాహ్నం నాటికి అనుకున్న పని పూర్తి చేస్తారు. చాలా రోజుల తర్వాత సాయంత్రం సమయంలో మీకిష్టమైన వారితో సరదాగా గడుపుతారు.

వృషభం: ఈ రాశివారు కార్యాలయంలో పై అధికారుల సహాయంతో అవరోధాలు అధిగమించగలుగుతారు. మీ పని వల్ల సహచరులు ప్రభావితమవుతారు. సోషల్ మీడియా ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారంలో సంక్లిష్టమైన సమస్యలను అనుభవం కలిగిన వ్యక్తి ద్వారా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ప్రవాహం ఉంటుంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. సామాజిక దూరాన్ని జాగ్రత్తగా పాటించాలి.

మిథునం: ఈ రాశి వారు కొన్ని రోజుల క్రితం మీరు కోల్పోయిన వస్తువును తిరిగి పొందుతారు వ్యాపారం గురించి తీవ్రంగా ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిమితుల కారణంగా మానస్సు కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం: ఈ రోజు నూతన పని చేపట్టే అవకాశముంది. ఇందులో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అయితే కొంత సమయం తర్వాత మీరు పనిలో నిమగ్నమవుతారు. కెరీర్ కు సంబంధించి పిల్లల పురోగతి సాధించడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. కెరీర్లో చింతలన్నీ తీరిపోతాయి. స్నేహితుడి కారణంగా మీ దినచర్యలో మార్పులు జరగవచ్చు.

సింహం: రోజు మీరు చేయాలనుకునే ఏ పనిలోనైనా ఏకాగ్రతతో చేయండి. అప్పుడే విజయం సాధించగలరు. ప్రభుత్వ అధికారి సహాయంతో ఆస్తి సంబంధిత విషయాలను పరిష్కరించుకుంటారు. పనిప్రదేశంలో కొన్ని సూచనలు తీసుకుంటారు. రోజువారీ వ్యాపారంలో ఆదాయం పెరుగుదల ఉంటుంది.

కన్య: ఈ రాశి వారు ఈ రోజు చురుకుగా ఉంటారు. కార్యాలయంలో మీ సహచరులు రిలాక్స్ మోడ్ లో ఉంటారు. పని చేయాలనే కోరికను ప్రదర్శిస్తారు. సృజనాత్మక పనిచేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ ప్రతిభను దాచడానికి ప్రయత్నిస్తుంది. అందులో మీరు విజయం సాధిస్తారు.

తులా: మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. గతంలో చేసిన ఏదైనా పని వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో మీరు ఏదైనా విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. అయితే అందులో ఎలాంటి హానీ లేదు. కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు. కార్యాలయంలో మీ పనిని సమయానికి ముందే పూర్తి చేస్తే ప్రత్యర్థులను నిరుత్సాహపరడచంలో విజయం లభిస్తుంది.

వృశ్చికం: పనిప్రదేశంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఫలితంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జూనియర్లతో ఏదైనా సమస్య ఉండవచ్చు.

ధనుస్సు: కార్యాలయంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. ఇది మీకు కష్టంగా అనిపించవచ్చు. సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. అనుకోకుండా లాభాల ఒప్పందాన్ని పొందడం ద్వారా డబ్బు ప్రవాహం ఉంటుంది. వ్యాపారం మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ రోజువారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

మకరం: మకర రాశి వారు ఈ రోజు కష్టపడి ఏ పని చేసినా మంచి ఫలితాన్ని పొందుతారు. భాగస్వామితో కలిసి ప్రయాణాలు సాగించే అవకాశముంది. ఇది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. కుటుంబ వ్యాపారంలో నూతన ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆకస్మిక ప్రయోజనం పొందే అవకాశముంది.

కుంభం: ఈ రోజు మీ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారు. కోపంపై నియంత్రణ లేకపోవడం వల్ల తమకు తామే నష్టపోతారు. విద్యార్థులు నెరవేరని లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం అందుకుంటారు. సహనంతో ఇంటితో పాటు కార్యాలయంలో సమస్యలను అధిగమిస్తారు. ప్రేమ జీవితంలో ఈ రోజు గొప్పగా ఉంటుంది. నూతన వ్యక్తులను కలవడం ద్వారా ఆనందదాయకంగా ఉంటుంది.

మీనం: వ్యాపారంలో ఏదైనా ఒప్పందం లేదా లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఆందోళన పడకండి. వ్యయాన్ని నియంత్రించుకోవడం కష్టంగా ఉంటుంది. స్నేహితుల సహకారంతో పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసుకుంటారు. మీరు ఇచ్చిన మార్గదర్శకత్వం నుంచి ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇది మీ సామాజిక పరిధిని పెంచుకుంటారు. మనోభావాలను నియంత్రించుకోండి. లేకపోతే మీరు అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆర్థిక సమతూల్యత క్షీణిస్తుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 9th April
Next Story