Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 5th June
X

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యలు సహకరాంతో అనుకూల ఫలితాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు పనిప్రదేశంలో మీపై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు శ్రమ పడాల్సి ఉంటుంది. మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండడం మంచింది.

మిథున రాశి: ఈ రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. పెళ్ళి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు లాభాల బాటలో పడతారు. అష్టమ శని కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకిష్టమైన వారి నుంచి శుభవార్త అందుకుంటారు. తల్లి, తండ్రుల నుంచి సహకారం పొందుతారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆదాయం కూడా కొద్దిగా పెరుగుతుంది. ఖర్చులకు కళ్ళెం వేయాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉగ్యోపరంగా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్ళి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కోపతాపాలకు ఇది సమయం కాదు. విదేశాల్లో ఉన్న సంతానం మంచి శుభవార్త అందుతుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారికి మంచి కబురు అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. బాగా దగ్గరి బందువులతో పెళ్ళి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. హామీ ఉండొద్దు.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వారికి వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉందాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒక లక్ష్యాన్ని సాధిస్తారు. ఏదైనా ప్రతికూల వార్తలు విన్నప్పుడు మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. సమీప బంధువులకు సంబంధించి దుర్వార్త వింటారు. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు ఆరోగ్యం పరవాలేదు. దాంపత్య జీవితంలో చాలా రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన ముగుస్తుంది. ఈ రోజు మీ సంబంధాలు చెదిరిపోయే అవకాశముంది. ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది.ముఖ్యంగా స్వయం ఉపాధివారికి బాగుంది. వృత్తి వ్యా పారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 5th June
Next Story