Top
logo

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు మాటలతో అందరిని ఆకట్టుకుంటారు.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 3rd June Predictions,  Astrology,  Horoscope
X

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది. ఇందులో చాలా వరకు విజయవంతమవుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపరాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మీరు తీసుకునే కీలక నిర్ణయాల వల్ల వ్యాపారాన్నివిస్తరించుకుంటారు. అధికారులనుండి ప్రశంసలు కూడా అందుకుంటారు.

మిథున రాశి: ఈ రాశి వారు తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు చేయవద్దు. లేకుంటే మీరు పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఓపికగా మీ పని మీరు చేసుకోవాలి. లేకుంటే సమస్యలు తీవ్రమవుతాయి. సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. మీ నిర్ణయం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీరు ఏమి చేయకపోయినా మీ వ్యక్తిత్వం వికసిస్తుంది. వ్యాపారంలో మీ తెలివితేటలతో లాభాలు అందుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశముంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. డబ్బు సంపాదిస్తేనే విజయం సాధించినట్లు అని పొరబడకండి. లేకుంటే మీరు సంతోషంగా ఉండలేరు. నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఫలితంగా అహంకారం పెరుగుతుంది. కార్యాలయంలో ప్రభుత్వ సహాయం పొందడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దానాలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుకు సరిపడ ఆదాయం లభిస్తుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు.సాయంత్రం సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం, ప్రశాంతత లభిస్తుంది.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దానాలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుకు సరిపడ ఆదాయం లభిస్తుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు.సాయంత్రం సమయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ప్రారంభించాలంటే కొంత సందిగ్ధత నెలకొంటుంది. అయితే కుటుంబ పెద్దల మార్గదర్శకత్వంతో దాన్ని ప్రారంభిస్తారు. రోజు చివర్లో డబ్బు ప్రవాహం అదికంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం కొంత ఆదా చేయగలుగుతారు. మీ కోరికలు నెరవేర్చడంలో ముందుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వుండాలి.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు . పోటీ పరీక్షల్లో సంతృప్తికరమైన ప్రయోజనాలు లభిస్తాయి. డబ్బుతో పాటు ఆనందానికి ఇతర మార్గాలు పెరుగుతాయి. ఎదుటి వారితో వాదించకుండా స్మూత్ గా మాట్లాడితే సమస్యలు రావు. లేకుంటే భవిష్యత్తులో ప్రయోజనకరమైన సంబంధాలు చెదిరిపోవచ్చు. అధికార పార్టీతో సాన్నిహిత్యం, పొత్తుల ద్వారా ప్రయోజనం పొందుతారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఇతర ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే పని ఆపివేస్తారు. మీ కార్యకలాపాలు మీ ఆలోచనకు విరుద్ధంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సహోద్యోగుల నుంచి మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. మీ తెలివితేటలతో రోజువారీ వ్యాపారంలో లాభాలు పొందుతారు. సకాలంలో ధన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు చేసే వారికి మీ తెలివితేటలు, జ్ఞానంలో పెరుగుదల ఉంటుంది.

మీన రాశి: ఈ రాశి వారికి ప్రతి అంశాన్ని కుటుంబ సభ్యలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యాలయంలో మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 3rd June
Next Story