Top
logo

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు మంచి - చెడూ..

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 30th March
X

Daily హోరోస్కోప్:(ఫైల్ ఇమేజ్)

Highlights

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి కోపం అధికంగా ఉండటం వల్ల మీకిష్టమైన వ్యక్తి లేదా పొరుగువారితో గొడవపడే అవకాశముంటుంది.

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం|మంగళవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరివిదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యంరా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున:మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: మేష రాశివారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కష్టపడి పనిచేస్తే అందులో విజయం సాధిస్తారు. ఈ రోజు అధికారుల నుంచి విభేదాలు అందుకుంటారు. కాబట్టి వాదనలు నివారించండి. మీ పనిపై దృష్టి పెట్టండి. విదేశీ ప్రయాణాలు ప్రబలంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

వృషభం: ఈ రోజు మీరు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కోపం అధికంగా ఉండటం వల్ల మీకిష్టమైన వ్యక్తి లేదా పొరుగువారితో గొడవపడే అవకాశముంటుంది. వ్యాపారంలో సంయమనంతో పనిచేయండి. వ్యాపారంలో భాగస్వాములుతో ఉద్రిక్తత నెలకొనవచ్చు. ప్రేమ జీవితంలో కొత్తదనం ఉంటుంది. విద్యారంగంలో విద్యార్థులు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు.

మిథునం: మిథున రాశి వారికి సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు పెరుగుతాయి. ఈ రోజు మీకు ఆనందకరంగా ఉంటుంది. పనిప్రదేశంలో ప్రత్యర్థులు ఓడిపోతారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా నూతన పని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకుంటారు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. సమీపంలో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటక: కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడుల్లో ఆదాయం లభిస్తుంది. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. పాత కేసులకు సంబంధించి ప్రభుత్వ పత్రాలను పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు మీ వాటాతో ప్రయోజనం పొందవచ్చు.

సింహ:నూతన పని ప్రారంభించడానికి లేదా ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడానికి తొందరపడకండి. లేకుంటే అనంతరం పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. సృజనాత్మక ఆలోచనను కలిగి ఉంటారు. సమీప ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు వాయిదా పడుతాయి. సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు.

కన్య: ఈ రోజు సమాజంలో మీ కీర్తి, ప్రతిష్ట పెరుగుతాయి. ఏ పనిచేయకపోయినా వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది. ఉత్తమ మార్గాల నుంచి డబ్బు సంపాదించుకుంటారు. వ్యాపారంలో మీ తెలివితేటలతో లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్తు వ్యూహాలపై పనిచేసే అవకాశముంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

తులా: తులా రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. కార్యాలయంలో అధికారులు మీ మాట వింటారు. ఇంట్లో పనులకు సంబంధించిన అన్ని పనులు సజావుగా చేసుకుంటారు. వ్యాపారంలో అమ్మకాలు, విక్రయాలు బాగుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. పోటీ పరీక్షలో విజయం సాధించడం ద్వారా విద్యార్థులు విశ్వాసం పొందుతారు.

వృశ్చిక: పనిప్రదేశంలో ఈ రోజు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వం నుంచి మద్దతు పొందుతారు. కార్యాలయంలో పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ అజ్ఞానం వల్ల కుటుంబ వాతావరణం చెదిరిపోవచ్చు. కాని కొంత సమయం తర్వాతా సాధారణ స్థాయికి వస్తుంది.

ధనుస్సు: ఆధ్యాత్మిక కోణం నుంచి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి కనబరుస్తారు. సమీప భవిష్యత్తులో మీరు ప్రయోజనం అందుకుంటారు. స్నేహితుడికి సహాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మాటలపై నియంత్రణ కలిగి ఉండండి.

మకర: మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మీరు చేయాలనుకున్న పనిలో ప్రారంభంలోనే అవరోధం కలగవచ్చు. ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే ఆపివేయాల్సి ఉంటుంది. స్థిరమైన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. కార్యాలయంలో కార్యకలపాలు మీ ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాయి. సహచరులు లేదా సహోద్యోగులు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు.

కుంభ: వ్యాపారం చేసేవారికి ప్రయోజనం ఉంటుంది. ఆదాయాన్ని పెంచేందుకు అవకాశాలు ఏర్పడతాయి. పనిభారం పెరుగుతూనే ఉంటుంది. మీ లక్ష్యాలను విజయవంతంగా సాధించడంలో మనస్సు లగ్నం చేస్తారు. ఈ రోజు మీరు చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. పని ప్రారంభించే ముందు గందరగోళానికి గురికాకుండా ఉండండి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక అవకాశాలు పొందుతారు.

మీనం: తండ్రి ఆశీర్వాదంతో ప్రారంభించిన పనిలో మీరు విజయం సాధిస్తారు. పనిలో లాభాలు అందుకుంటారు. సోదరీసోదరమణులతో మంచి సమయాన్ని వెచ్చిస్తారు. ప్రమాదకర పెట్టుబడుల్లో అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆదాయ మార్గాల్లో పెరుగుదల ఉంటుంది. భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 30th March 2021
Next Story