Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు.. నేటి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 20 October 2021
X

Representation Photo

Highlights

Daily Horoscope: ఈరోజు మీరోజు.. నేటి రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం;శుక్లపక్షం పూర్ణిమ: రా.7.20 తదుపరి బహుళ పక్ష పాడ్యమి రేవతి: మ.2.11 తదుపరి అశ్విని వర్జ్యం: లేదు అమృత ఘడియలు: ఉ.11.39 నుంచి 1.20 వరకు దుర్ముహూర్తం: ఉ.11.22 నుంచి 12.08 వరకు రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.5-57, సూర్యాస్తమయం: సా.5-34

మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి: ఈరాశి వారికి ఈ ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులతో కష్టాలు పడతారు. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. .

తులా రాశి: ఈ రాశి వారికి ఈ వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. వీలైనంతగా రుణ భారం తగ్గించుకుంటారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి : ఈరాశి వారికి ఈరోజు వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినీ నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు.

మకర రాశి: ఈ రాశివారికి ఈ రోజు వ్యాపారపరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జీవితానికి పనికివచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆ రోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు

మీన రాశి: పాత స్నేహితులను కలుస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మీరిచ్చే సమయం కోసం మీ దగ్గరి వాళ్ళు ఎదురుచూస్తుంటారు. వారిని నిరుత్సాహపరచకండి. పెద్దలను గౌరవించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్త అవసరం.

గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 20 October 2021
Next Story